ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను మొదటి నుంచి కేంద్రమంత్రి ఖండించారు. ఎలాంటి దర్యాప్తు ప్యానల్ ముందైనా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ఘటన జరిగిన సమయంలో తాను కానీ తన కుమారుడు కానీ అక్కడ లేమని ఆయన పునరుద్ఘాటించారు.
దర్యాప్తు నిస్పక్షపాతంగా జరుగుతుందని అజయ్ మిశ్రా వెల్లడించారు. అయితే తన పేరు ఎఫ్ఐఆర్‌లో నమోదైందని వస్తోన్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. న్యాయ విధానాల గురించి తనకు తెలుసని.. ఓ సాధారణ పౌరుడిలానే విధానాలను గౌరవిస్తానన్నారు.
రాజీనామా వార్తలపై..
ఈ ఘటన కారణంగా తన పదవికి రాజీనామా చేయమని ప్రతిపక్షాలు కోరడం సమంజసం కాదన్నారు అజయ్ మిశ్రా.
తన కుమారుడికి భద్రత కోరారా అన్న ప్రశ్నకు మిశ్రా స్పందిస్తూ తాను తన కుమారుడికి ఎలాంటి భద్రత కోరలేదని.. తన జిల్లాలో ఎలాంటి సమస్యలు లేవన్నారు.
ఈ రోజు ఉదయం హోంశాఖ కార్యాలయంలో అమిత్ షాతో అజయ్ మిశ్రా సమావేశమయ్యారు. లఖింపుర్ ఘటన గురించి అమిత్ షా కు ఆయన వివరించినట్లు సమచాారం.
ఆశిష్ మిశ్రాపై కేసు..
ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రైతులపై దూసుకెళ్లిన వాహనంలో ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో అజయ్ మిశ్రా పేరు కూడా ఉంది.
రూ.50 లక్షల సాయం..