RBI secret mission this Dhanteras brings back another 102 tonnes :  ఆర్బీఐ ధన త్రయోదశి రోజున  ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ నుంచి  102 టన్నుల బంగారాన్ని మన దేశానికి తరలించింది. టన్నులను  కిలోల్లోకి మారిస్తే లక్షా రెండు వేల కేజీలు అవుతుంది. ఇంత భారీ  బంగారాన్ని స్పెషల్ ఆపరేషన్ ద్వారా ఇండియాకు చేర్చారు. సీక్రెట్ గా భద్రపరిచారు. ఇందుకోసం ప్రత్యేక విమానాలను కూడా ఉపయోగించింది. తాజా తరలింపుతో కలుపుకొని మన దేశంలో బంగారం నిల్వలు 510.5 టన్నులకు చేరాయి. ఇంగ్లండ్‌లో దాచింది మొత్తం 855 టన్నులు కాగా మిగతా పసిడి ఆ బ్యాంక్‌లోనే ఉంది.


భారత్‌కు ఉన్న బంగారం నిల్వలు మొత్తం మన దేశంలో లేవు.  స్వదేశంలో 510.5 టన్నులు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌, బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ వద్ద 324 మెట్రిక్‌ టన్నుల నిల్వ ఉన్నది. ఇక మరో 20.26 టన్నుల బంగారం డిపాజిట్ల రూపంలో ఉంది. విదేశాల్లో మన బంగారం ఉండటానికి విచిత్రమైన కారణాలు ఉన్నాయి.   1991 సంవత్సరంలో దేశంలో దిగుమతి చేసుకోవడానికి విదేశీ కరెన్సీ లేదు. అప్పుడు భారతదేశం తన 67 టన్నుల బంగారాన్ని  తనఖా పెట్టి 2.2 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. బంగారాన్ని తనఖా పెట్టేందుకు ప్ర ముంబై విమానాశ్రయంలో చార్టర్ విమానం  బంగారంతో ఇంగ్లండ్‌కు వెళ్లింది. అప్పుడు భారతదేశం ఇంగ్లండ్ నుంచి రుణం పొందింది.   


మన ప్రకృతి వైద్యం పవర్ అలాంటిది - సీక్రెట్‌గా వచ్చి ట్రీట్‌మెంట్ చేయించుకున్న బ్రిటన్ రాజు, రాణి !


ఆ రుణం భారత్ తీర్చేసింది. ఆ బంగారం మాత్రం అక్కడే ఉంది.  చాలా దేశాల్లోని కేంద్ర బ్యాంకులు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి. భారత్‌ ఇదే చేసింది. 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. పైగా కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున పుత్తడిని కొనుగోలు చేస్తూ వచ్చిన ఆర్బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో నిల్వచేస్తూ వస్తోంది. ఇప్పుడు మెల్లగా వెనక్కి తీసుకు వస్తోంది.  మన దేశ బంగారాన్ని లండన్ నుంచి వెనక్కి తీసుకు రావడం ఇదే మొదటి సారి కాదు. నాలుగు నెలల కిందట  వంద టన్నుల అంటే.. లక్ష కిలోలు. ఇంత భారీ స్థాయిలో బంగారం ఇంగ్లండ్‌ నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖజానాకు చేరింది. 1991 తర్వాత  పెద్ద మొత్తంలో దేశానికి బంగారాన్ని వెనక్కి తీసుకు వస్తోంది ఇప్పుడే.


అణుదాడికి రెడీ అవుతున్న రష్యా - ఉక్రెయిన్‌కు ఆయుధాలిచ్చే దేశాలపైనే మొదటి గురి !


2024 మార్చి ముగింపు నాటికి భారత్‌ వద్ద 822.1 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీంట్లో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసి ఉంచింది. బంగారం నిల్వ చేసినందుకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు ఆర్‌బిఐ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. తాజా తరలింపునతో ఆర్‌బిఐకి కొంత నిర్వహణ వ్యయాలు తగ్గనున్నాయి.