King Charles Queen Camilla secretly visit Bengaluru: బ్రిటన్ రాజ దంపతులు చార్లెస్, కెమిల్లాలు ఎక్కడకు వెళ్లినా  ప్రోటోకాల్ ఉంటుంది. వారు దేశాధినేతలు కాకపోయినా అంతకు మించిన గౌరవం లభిస్తుంది. వారు ఇండియాకు వస్తే మీడియాకు వారి గురించి చెప్పే గొప్పల వార్తలతో తీరిక ఉండదు. కానీ ఈ సారి మాత్రం ఆ రాజ దంపతులు వచ్చింది.. పోయింది కూడా ఎవరికీ తెలియదు. అంత సీక్రెట్‌గా టూర్ జరిగిపోయింది. వారు బెంగళూరు వచ్చిపోయారు. ఇంతకీ  బెంగళూరులో ఈ రాజ జంట ఏం చేశారు ?           


ఇటీవలే క్యాన్సర్ బారిన  పడిన బ్రిటన్ రాజు  చార్లెస్                    


బెంగళూరు శివారులో శౌక్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్ ఉంటుంది. ఇది అత్యంత లగ్జరీ వెల్ నెస్ సెంటర్. ప్రకృతి వైద్యంలో మంచి పేరు ఉంది. ఇటీవల బ్రిటన్ కింగ్ చార్లెస్ కు క్యాన్సర్ ఉన్నట్లుగా బయటపడింది. దీంతో ఆయన ప్రకృతి వైద్యాన్ని కూడా నమ్ముకున్నారు. బాగా ఆరా తీస్తే ఇండియాను మించినది లేదని అర్థమైపోయింది. వెంటనే బెంగళూరులోని శౌక్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్ లో కొన్నాళ్లు ట్రీట్ మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం కాబట్టి .. ఇండియాకు వచ్చింది.. వెళ్లింది కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. వెల్ నెస్ సెంటర్ నిర్వాహకులు కూడా అంతే గోప్యంగా వారికి ప్రకృతి వైద్యం అందించారు.        


అణుదాడికి రెడీ అవుతున్న రష్యా - ఉక్రెయిన్‌కు ఆయుధాలిచ్చే దేశాలపైనే మొదటి గురి !


మూడు రోజుల పాటు ట్రీట్ మెంట్                    


27 వతేదీన వచ్చారు. బుధవారం అంటే 30వ తేదీన వెళ్లిపోయారు. యోగాతో పాటు ప్రకృతి వైద్యంలోని కీలక అంశాలను పూర్తి చేశారు. ఉదయం నుంచి  రాత్రి తొమ్మిది గంటల వరకూ చార్లెస్ వివిధ రకాల థెరపీలు చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రకృతి వైద్య శిబిరం ఆయనకు కొత్తేమీ కొంత మంది చెబుతున్నారు. ఆయన గతంలోనూ ఈ వెల్ నెస్ సెంటర్ ను సీక్రెట్ గా సందర్శించి చికిత్స పొందారని చెబుతున్నారు. ఓ సారి దీపావళి కూడా ఈ వెల్ నెస్ సెంటర్‌లో జరుపుకున్నట్లుగా తెలుస్తోంది. 


ప్రముఖులకు ట్రీట్‌మెంట్ ఇచ్చే శౌక్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్             


 శౌక్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్ వీఐపీలకు హాట్ ఫేవరేట్. విదేశాల నుంచి వచ్చేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. మిడిల్ ఈస్ట్, యూరప్ నుంచి రాయల్ ఫ్యామిలీస్ తరచూ సందర్శిస్తూ ఉంటాయి. 2011లో ప్రారంభమైన ఈ  శౌక్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్ భారత ఆయుర్వేద వైద్య చికిత్సలు అయిన  పంచకర్మ, ఆక్యుపంక్చర్, రిఫ్లెక్లాలజీ వంటి సేవల్ని అందిస్తుంది.