Ram Mandir Pran Pratishtha: అయోధ్య రామ మందిర ఉద్యమాన్ని (Ayodhya Ram Mandir Opening) ముందుండి నడిపించిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ప్రాణ ప్రతిష్ఠ (Ramlala Pran Prathishta) ఉత్సవానికి హాజరు కావడం లేదు. నిజానికి ఆయనకు అసలు అయోధ్య వేడుకకు ఆహ్వానమే అందలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరవాత కేంద్రం ఆయనకీ ఆహ్వానం పంపింది. ఆహ్వానం అందినప్పటికీ అడ్వాణి ఈ వేడుకకు హాజరయ్యే పరిస్థితిలో లేరు. ఉత్తరాదిలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పడిపోయాయి. విపరీతంగా చలి గాలులు వీస్తున్నాయి. ఈ చలికి తట్టుకోలేకనే అద్వానీ హాజరవ్వలేకపోతున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రామ్ మందిర్ ట్రస్ట్ ఈ విషయం వెల్లడించింది. అద్వానీ పాటు మురళీ మనోహర్ జోషి కూడా హాజరయ్యే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. వయసు పైబడడం వల్ల రావడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. 


"అద్వానీతో పాటు మురళీ మనోహర్‌ జోష్‌కీ ఆహ్వానం పంపాం. ఇద్దరూ పెద్ద వాళ్లే. వయసు రీత్యా వాళ్లు హాజరయ్యే అవకాశాలు లేవు. మేం రావాలని కోరాం. అందుకు వాళ్లు అంగీకరించారు కూడా. కానీ వచ్చే అవకాశాలు తక్కువే"


- రామ్ మందిర్ ట్రస్ట్ 


అయితే..అంతకు ముందు విశ్వహిందూ పరిషత్ లీడర్ ఒకరు అద్వానీ తప్పకుండా హాజరవుతారని చెప్పారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. కానీ...విపరీతమైన చలి కారణంగా అద్వానీ ఈ వేడుకకు హాజరు కావడం లేదు.