Naval Commanders' Conference:


రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో 


మార్చి 6 వ తేదీన త్రివిధ దళాధిపతులు సమావేశం కానున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో INS విక్రాంత్ ఎయిర్‌ క్రాఫ్ట్ క్యారియర్‌లో నావల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ జరగనుంది. రక్షణ పరంగా అనుసరించాల్సిన వ్యూహాత్మక విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీనియర్ అధికారులంతా ఈ భేటీలో పాల్గొనున్నారు. సముద్ర జలాలపై జరుగుతున్న తొలి సమావేశం ఇదే. అది కూడా దేశీయంగా తయారైన INS విక్రాంత్‌పై జరుగుతుండటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 


"తొలిసారి కమాండర్స్ కాన్ఫరెన్స్ సముద్ర జలాలపై జరుగుతోంది. మరో విశేషం ఏంటంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన INS విక్రాంత్‌లో సమావేశం జరగనుంది" 


- రక్షణ శాఖ 










చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌తో పాటు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. నావల్ కమాండర్స్‌తో కీలక అంశాలపై చర్చించనున్నారు. చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్‌ సహా ఇతర నావల్ కమాండర్‌లు పలు విషయాలపై రివ్యూ చేయనున్నారు. ఆపరేషనల్, మెటీరియల్‌, లాజిస్టిక్స్, హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్ సహా ట్రైనింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాల్లో పురోగతిపై చర్చలు జరపనున్నారు. గత ఆర్నెల్లలో ఈ విభాగాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చర్చించడంతో పాటు భవిష్యత్‌లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తారు. ఇదే సమావేశంలో అగ్నిపథ్ పథకంపైనా చర్చలు జరగనున్నాయి. 


Also Read: Tamil Nadu: వలస కూలీలకు అండగా ఉంటాం, ఎవరూ భయపడాల్సిన పని లేదు - తమిళనాడు సీఎం స్టాలిన్