Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తప్పుకున్నారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. దిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం తర్వాత గహ్లోత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎంగా ఉంటారా?
ఈ సందర్భంగా అశోక్ గహ్లోత్‌ను మీడియా ఓ ప్రశ్న వేసింది. ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మీరే కొనసాగుతారా? అనే ప్రశ్నకు గహ్లోత్ ఆసక్తికర సమాధానం చెప్పారు.
డిగ్గీ రాజా X శశిథరూర్
కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి గహ్లోత్ ఔట్ అవడంతో ఈ పదవికి ఎవరెవరు పోటీ చేస్తున్నారనే దానిపై స్పష్టత వచ్చింది. తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ బరిలో ఉండటం ఖాయం కాగా ఆయనతో మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ పడేందుకు సిద్ధమయ్యారు.
అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు దిగ్విజయ్ ఇప్పటికే ప్రకటించారు. నామినేషన్ పేపర్లను కూడా తీసుకున్నారు. శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ రేసు నుంచి తప్పుకోవడంతో దిగ్విజయ్, శశిథరూర్ మధ్యే పోటీ నెలకొంది.
ముఖ్యమైన తేదీలు
- నామినేషన్లకు చివరి తేదీ: సెప్టెంబర్ 30
- నామినేషన్ పత్రాల పరిశీలన: అక్టోబర్ 1
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 8
- ఓటింగ్: అక్టోబర్ 17
- ఫలితాలు: అక్టోబర్ 19
Also Read: Abortion Rights Judgement: అబార్షన్ హక్కులపై సుప్రీం సంచలన తీర్పు- ఏం చెప్పిందంటే?