Raj Kundra kidney offer to guru stuns Shilpa Shetty:  స్వామిజీల దగ్గరకు వెళ్తే కానుకలకు పదో పరకో భక్తులు సమర్పించుకుంటారు. ధనవంతులైతే కాస్త ఎక్కువ  సమర్పించుకుంటారు. మరీ తెలివైన ధనవంతులైతే.. అసలు సమర్పించుకోవడానికి అవకాశం లేని అరుదైనవి  ఇచ్చేస్తానని చెప్పి సంతృప్తి పరుస్తారు. శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రా ఆ కోవకే చెందుతారు.  రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి భర్త  కలిసి  వృందావన్‌లో ఉన్న అధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్‌ను కలిశారు. పూజలు చేశారు. ఈ సంభాషణలో, మహారాజ్ తన రెండు కిడ్నీలు విఫలమై 10 సంవత్సరాలుగా ఆ స్థితిలో జీవిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయం రాజ్‌ కుంద్రాను  కదిలించింది. వెంటనే  అతను తన కిడ్నీని దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మాట ఇచ్చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది.  

 సోషల్ మీడియాలో కొందరు ఈ చర్యను "పీఆర్ స్టంట్" అని విమర్శించారు.దీనికి రాజ్ కుంద్రా స్పందించారు.  నిజమైన జ్ఞానం అనేది హృదయంలో ఉంటుందని.. ఒకరి గురించి తీర్పు చెప్పే ముందు, వారి గురించి ఆలోచించండని పోస్టు పెట్టారు.  ఒకవేళ దయను 'పీఆర్ స్టంట్' అని పిలిస్తే, అప్పుడు నేను ఈ గుర్తింపును గర్వంగా ధరిస్తాననని స్పందించారు. 

రాజ్ కుంద్రాకు వివాదాస్పద నేపధ్యం ఉంది. ముఖ్యంగా 2021లో పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయ్యారు. ఇటీవల ఆయనపై ఓ రుణమోసం కేసు కూడా నమోదు అయింది. అందుకే  దీనిని పబ్లిసిటీ స్టంట్‌గా కొంత మంది నెటిజన్లు అభివర్ణించారు  రాజ్ కుంద్రా  పై 2024 నవంబర్‌లో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అతని ఆస్తులపై దాడులు నిర్వహించింది, దీనిలో మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఈ గత వివాదాల కారణంగా ఇలాంటి ప్రకటన  చేసి ఉంటారని అంటున్నారు.    

 కొందరు రాజ్‌ను సమర్థిస్తూ, అతని గతం అతని ప్రస్తుత చర్యలను నిర్వచించకూడదని వాదించారు, మరికొందరు దీనిని వ్యంగ్యంగా, హాస్యాస్పదంగా  సెటైర్లు వేస్తున్నారు.