Mahindra Scorpio Classic Deal August 2025: మహీంద్రా స్కార్పియో క్లాసిక్, బలంగా వంపు తిరిగిన బాడీ లైన్స్, అగ్రెసివ్ గ్రిల్ డిజైన్‌తో రోడ్డుపై ప్రత్యేకంగా కనిపిస్తుంది. కొత్త LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs) & షార్ప్ హెడ్‌ల్యాంప్స్ దీని ఫ్రంట్ లుక్‌కి మరింత స్టైలిష్ టచ్ ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్‌లో ఉన్న బోల్డ్ స్క్వేర్-ఆఫ్ వీల్ ఆర్చెస్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ SUV రగ్డ్ ఫీల్‌ను మరో స్టేజ్‌కు తీసుకువెళతాయి. రియర్ డిజైన్‌లో ఉన్న కొత్త LED టెయిల్‌ల్యాంప్స్, స్కార్పియో బ్రాండింగ్ దీనిని ఒక క్లాసిక్‌గా, అదే సమయంలో ఆధునికంగానూ చూపిస్తాయి.
మీరు మహీంద్రా స్కార్పియో కొనాలని ప్లాన్ చేస్తుంటే, వెంటనే కొనేయడం మీకు మంచి అవకాశం కావచ్చు. ఈ నెల అంటే ఆగస్టు 2025లో, మహీంద్రా కంపెనీ, స్కార్పియో క్లాసిక్ మోడల్‌పై మొత్తం రూ. 70,000 తగ్గింపును అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, అదనపు హంగులు (ఉపకరణాలు), ఎక్స్ఛేంజ్ బోనస్ & స్క్రాపేజ్ బోనస్ కలిసి ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.77 లక్షల నుంచి ప్రారంభమై రూ. 17.72 లక్షల వరకు ఉంది. ఈ నెల (ఆగస్టు 2025)లో రూ. 70,000 తగ్గింపుతో, ఈ SUV మరింత అందుబాటులోకి వస్తుంది. కంపెనీ ఇచ్చే డిస్కౌంట్ వేరియంట్ & స్థానాన్ని బట్టి మారవచ్చు.
హైదరాబాద్‌లో, మహీంద్రా స్కార్పియో ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 17.18 లక్షలు. ఇందులో, రిజిస్ట్రేషన్ ఛార్జీలు దాదాపు రూ. 2.42 లక్షలు, ఇన్సూరెన్స్ దాదాపు రూ. 85,000, ఇతర ఖర్చులు కలిసి ఉన్నాయి. విజయవాడలో ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 17.29 లక్షలు.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఫీచర్లుక్యాబిన్‌లో 9-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్‌తో పాటు డ్యూయల్-టోన్ బ్లాక్ థీమ్ ఉంది. స్కార్పియో క్లాసిక్‌లో ఆడియో కంట్రోల్స్‌తో పాటు లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్, ఎత్తును సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, పార్ట్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో పవర్‌ట్రెయిన్ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 132hp పవర్, 300Nm టార్క్ ఇచ్చే 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమై పని చేస్తుంది. పూర్తిగా అల్యూమినియంతో తయారైన తేలికపాటి GEN-2 mHawk ఇంజిన్ దీనిలో ఉంది.
భద్రతలుమహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUVలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, రియర్ పార్కింగ్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్, ABS, LED DRLsతో ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు & స్పీడ్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ కారులో 460 లీటర్ల బూట్ స్పేస్, 60 లీటర్ల పెద్ద ఇంధన ట్యాంక్ అందుబాటులో ఉంటుంది.