Chinni Serial Today Episode బాలరాజు అమ్మవారి దగ్గరకు వెళ్లి గాజులు సమర్పించి తన భార్యాపిల్లల కోసమే బతుకుతున్నా నా కూతురు చిన్ని అంటే నాకు ప్రాణం.. నా ప్రాణాలు కాపాడిన దేవత నా కూతురు.. రాక్షసుడి లాంటి నన్ను నా కూతురు మార్చేసింది..  నా కూతురు, భార్య ఎక్కడున్నారో తెలీక అసలు ఉన్నారో లేదో తెలీక నరకం అనుభవిస్తున్నా.. ఈ నరకం నుంచి నన్ను కాపాడు..  కావేరి, చిన్నిల జాడ తెలిసేలా చేయమని కోరుకుంటాడు. 

Continues below advertisement

బాలరాజుకి అమ్మవారి దగ్గర గాజులు ఒకామె ఇస్తే మా ఇంట్లో ఆడవాళ్లు లేరు నువ్వే వేరే ఎవరికైనా ఇచ్చేయమ్మా అని చెప్తాడు. మధు కూడా బాలరాజు పక్కనే ఉంటుంది. పక్కపక్కనే నడుస్తూ ఉంటారు కానీ ఎవరూ ఒకర్ని ఒకరు చూసుకోరు. చిన్ని కూడా అదే అమ్మవారి దగ్గరకు వచ్చి పదేళ్ల క్రితం అమ్మని పోగొట్టుకున్నాను.. నాన్న కూడా దూరం అయిపోయాడు అన్న భ్రమలో బతికాను.. నాన్న జైలు నుంచి రిలీజ్ అయ్యాడని తెలిసింది నాన్న ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకు తెలిసేలా ఆశీర్వదించు తల్లి అని కోరుకుంటుంది. ఇక అక్కడున్న అమ్మ బాలరాజు పెట్టిన గాజులు మధుకి ఇచ్చి అమ్మవారి గాజులు తల్లీ అంతా మంచే జరుగుతుంది తీసుకో అని చెప్తుంది. మధు మహా ప్రసాదంలా తీసుకుంటుంది. పక్కనే తండ్రి వెళ్లినా చూడదు. 

మరోవైపు దేవేంద్రవర్మ, నాగవల్లి గతంలో కావేరి, చిన్ని చనిపోయారు అని చెప్పిన రౌడీల దగ్గరకు వస్తారు. నిజంగా ఆ రోజు చిన్ని చనిపోయిందా అని అడుగుతాడు. వాళ్లు తడబడటంతో చితక్కొడతాడు. దాంతో రౌడీలు కావేరి ఒక్కర్తే చనిపోయిందని చిన్ని తప్పించుకుంది విషయం తెలిస్తే మీరు చంపేస్తారని అలా చెప్పానని అంటారు. చిన్ని ఎక్కడున్నా తెలుసుకొని చంపేయాలని దేవా వల్లితో చెప్తాడు. ఇక రాత్రి వర్షం పడుతుంది మధు ఇంకా రాలేదని సుబ్బారావు బయట ఎదురు చూస్తుంటాడు. ఇంతలో మధు, పద్దూ వస్తారు. మధు స్కూటీ ఆపి దిగకుండా తండ్రి గురించి ఆలోచించి వాకిట్లో పడిపోతుంది. సుబ్బు, పద్దూ, స్వరూప చాలా భయపడిపోతారు. మధుని ఇంట్లోకి తీసుకెళ్లి డాక్టర్‌కి పిలుస్తారు. డాక్టర్ చూసి ఏం కాలేదని చెప్పి సుబ్బుతో మందులు ఇస్తాను రా అని పిలుస్తాడు. 

Continues below advertisement

డాక్టర్ సుబ్బుతో మధు మనసులో ఏదో బెంగ పెట్టుకొని ఎక్కువ దాని గురించి ఆలోచిస్తూ ఇలా అయిపోతుంది తన బాధ తెలిస్తే మనం అలా మందులు ఇవ్వొచ్చు లేదంటే తన ప్రాణాలకే ప్రమాదం ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతాడు. దాంతో సుబ్బు మధు గతం మొత్తం చెప్తారు. తను మళ్లీ రాజమండ్రి వెళ్లడం వల్ల గతం జ్ఞాపకాలు వచ్చాయి. తన తండ్రిని కలిస్తే తప్ప తన బాధ పోదని అనుకుంటుంది. 24 గంటలు అదే ఆలోచిస్తుందని చెప్తారు డాక్టర్. భవిష్యత్‌లో ప్రాబ్లమ్ అవుతుందని చెప్తారు. 

మధు పద్దూతో పదేళ్ల నుంచి బాధ మనసులో ఉందని నాకు తెలీదు. నా వాళ్లు అందర్ని మర్చిపోయాను. వాళ్ల ముఖాలు కూడా గుర్తు లేవు. ఎదురుపడినా గుర్తు పట్టలేని పరిస్థితి.. మళ్లీ రాజమండ్రి వెళ్లడంతో వాళ్లు గుర్తొచ్చారు. అందరూ ఎక్కడున్నారో ఎలా ఉన్నారో. నాన్న గురించి తెలిసింది.. మా నాన్నని కలిస్తే మిగతా వాళ్లు గురించి తెలుస్తుందేమో అని అంటుంది. దాంతో పద్దూ నువ్వు దూరం అయిన వాళ్లని త్వరలోనే కలుస్తావ్ అని ధైర్యం చెప్తుంది. మరోవైపు మహి కూడా శ్రేయతో తనకు పెళ్లి చేయాలి అనుకోవడం 3 నెలల గడువు గురించి ఆలోచిస్తాడు. ఎలా అయినా 3 నెలల్లో చిన్నిని పట్టుకోవాలి లేదంటే నా జీవితం నాశనం అయిపోతుంది అనుకుంటాడు. మరోవైపు చిన్ని కూడా 3 నెలల్లో మహి, చందు వాళ్లని కనుక్కోవాలని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.