Rahul Gandhi Truck Ride Video: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2023 మే 22వ తేదీ సోమవారం రాత్రి హర్యానాలోని ఓ ట్రక్కులో ఎక్కి అంబాలా నుంచి ఛండీగఢ్ వరకు ప్రయాణించారు. అర్ధరాత్రి 50 కిలో మీటర్ల మేర ట్రావెల్ చేశారు. కాంగ్రెస్ నేత ఇమ్రాన్ ప్రతాప్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
ప్రస్తుతం రాహుల్ లారీలో ప్రయాణించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. లారీ డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ ట్రక్కులో ప్రయాణించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి సిమ్లాకు బయలుదేరారు. దారిలో లారీ ఎక్కి అంబాలా నుంచి చండీగఢ్ వరకు ట్రావెల్ చేశారు. కాంగ్రెస్ నేతలంతా ఈ వీడియోను షేర్ చేస్తూ రాహుల్ గాంధీని ప్రశంసించారు. ముఖ్యంగా ఆయన ఆటోలు, ట్రక్కు డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు ఇలా ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు.
వీడియో షేర్ చేసిన సుప్రియా శ్రీనాటే..!
కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా కూడా ఈ వీడియోను షేర్ చేశారు. అర్ధరాత్రి బస్సులో సాధారణ పౌరులను, ట్రక్కు డ్రైవర్‌లను కలవడం వెనుక కారణాన్ని కూడా వివరిచారు. రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజల సమస్యలను పూర్తిగా తెలుసుకొని, అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేశారని అన్నారు. ఇలా చేయడం చూస్తుంటే ఓ రకమైన ఆత్మవిశ్వాసం కల్గుతోందని ఆమె అన్నారు. అలాగే ప్రజలతో మమేకమైన వ్యక్తి.. వారి మంచి కోసం, రేపటి భవిష్యత్తు కోసం ఎలాంటి త్యాగం చేయడానికి అయినా వెనుకాడరని అన్నారు.
ఇటీవలే డెలివరీ బాయ్‌తో స్కూటర్ రైడ్..
దేశంలోని చిన్న వర్గాల ప్రజలతో మమేకమయ్యేందుకు రాహుల్ గాంధీ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బెంగళూరులో డెలివరీ బాయ్‌తో కలిసి స్కూటర్‌పై ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓల్డ్ ఢిల్లీలోని మతియా మహల్ మార్కెట్, బెంగాలి మార్కెట్‌కి కూడా గతంలో వెళ్లారు. అక్కడ చాలా సేపు షాపింగ్ చేశారు. అక్కడి ఫేమస్ వంటకాలన్నీ రుచి చూశారు. స్థానికంగా అందరూ ఎంతో ఇష్టపడే షర్బత్ తాగారు. పండ్లు తిన్నారు. ఆ తరవాత పానీపూరి కూడా టేస్ట్ చేశారు. అక్కడే కాదు. ఢిల్లీలోని ఫేమస్ ఫుడ్ పాయింట్‌లకు వెళ్లి సందడి చేశారు.