Lok Sabha Elections: బలమైన ప్రత్యర్థిని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రత్యామ్నాయం చూపితే 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించగలమని రాహుల్ గాంధీ నమ్మకం వ్యక్తం చేశారు. బీజేపీతో విడివిడిగా కాకుండా నేరుగా తలపడితే మనం విజయం సాధించగలమని రాహుల్ గాంధీ విపక్షాలకు సూచించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఈ కీలక వ్యాఖ్లు చేశారు.
అసలు ప్రజాసమస్యల కన్నా హిందూ- ముస్లిం అంశాన్నే హైలెట్ చేస్తున్న మీడియా : రాహుల్
హిందువులు, ముస్లింల మధ్య పోలరైజేషన్ ఫలితాలను మారుస్తోందన్న అభిప్రాయంపైనా రాహుల్ గాందీ స్పష్టత ఇచ్చారు. అది ఓ రకంగా ప్రభావం చూపుతున్నప్పటికీ.. పేదరికం, నిరక్షరాస్యత, ధరల పెరుగుదల, ప్రభుత్వ ఆదేశాలతో చిన్న బాధలు వంటి వాస్తవ సమస్యలు కీలకమన్నారు. అయితే వీటి నుంచి ప్రజలను మళ్లించే సాధనంగా మీడియా వ్యవహరిస్తోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు .అసలు సమస్యలను కాకుండా.. మతం లాంటి ఇతర సమస్యలను హైలెట్ చేయడం వల్లే ప్రజలు నిజాల్ని తెలుసుకోలేకపోతున్నారన్నారు.
ఇప్పుడు ఫాసిజం నడుస్తోంది : రాహుల్
న్యాయవ్యవస్థ పూర్తిగా స్వతంత్రంగా లేకుండా పోయిందని అన్నారు. ్లాగే పత్రికా స్వేచ్ఛ లేదని మాజీ కాంగ్రెస్ చీఫ్ అన్నారు. "ఫాసిజం ఇప్పటికే ఉంది.. ఇప్పుడు పార్లమెంటు పనిచేయడం లేదు. రెండేళ్లుగా తాను మాట్లాడలేకపోతున్నాను.. తాను పార్లమెంట్‌లో మాట్లాడటం ప్రారంభించిన వెంటనే న మైక్రోఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేస్తారు" అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్-చైనా సంబంధాలను కూడా ఆయన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. పాశ్చాత్య దేశాలు చైనాతో పారిశ్రామిక స్థాయిలో పోటీ పడగలవని, ముఖ్యంగా ముడిసరుకు ఉత్పత్తిలో భారత్ పోటీ పడగలవని రాహుల్ అన్నారు.
జోడోయాత్రను తపస్సుతో పోల్చుకున్న రాహుల్
రాహుల్ గాంధీ తన 'భారత్ జోడో యాత్ర'ను ఓ తపస్సుగా అభిర్ణించారు. రాహుల్ గాంధీ కూడా ఈ ఇంటర్వ్యూలో భారత తొలి ప్రధాని గురించి మాట్లాడారు. తన ముత్తాత జవహర్‌లాల్ నెహ్రూ .. తాను పుట్టక ముందే మరణించినప్పటికీ తనకు మార్గదర్శిగా రాహుల్ అభఇవర్ణించారు. తన అమ్మమ్మ ఇందిరాగాంధీకి తాను చాలా ఇష్టమని, ఆమెతో బలమైన బంధాన్ని పంచుకున్నానని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీని తామే ఎదుర్కోగలమని ఎవరికి వారు పోటీ పడుతున్నారు. కానీ రాహుల్ గాందీ మాత్రం కలిసి పోటీ చేద్దామని పిలుపునిచ్చారు. మరి విపక్షాలు స్పందిస్తాయో లేదో వేచి చూడాల్సి ఉంది.