Rahul Gandhi as LoP: రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. ఏకగ్రీవంగా ఈ పదవికి రాహుల్‌ని ఎన్నుకుంటున్నట్టు ప్రకటించింది. పార్లమెంట్‌లో పార్టీని ఆయనే ముందుండి నడిపిస్తారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. 


"లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. పార్లమెంట్‌లో పార్టీని సరైన విధంగా నడిపే వ్యక్తి రాహుల్ మాత్రమే"


- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ 


ఖర్గే ప్రకటిస్తారట..


కీలక నేతలంతా రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానించారని కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివ కుమార్ వెల్లడించారు. అయితే...అధికారికంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ పేరుని ప్రకటిస్తారని స్పష్టం చేశారు. కీలక నేతలంతా రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటూ తీర్మానించారని కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివ కుమార్ వెల్లడించారు. అయితే... అధికారికంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ పేరుని ప్రకటిస్తారని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌కి కొంత జోష్ వచ్చింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి 99 సీట్లు సాధించి ఉనికి నిలబెట్టుకుంది. లోక్‌సభలో రెండో అతి పెద్ద పార్టీగా నిలిచింది. 2014లో అధికారం కోల్పోయిన తరవాత మళ్లీ ఇన్నాళ్లకు కాంగ్రెస్‌కి ప్రతిపక్ష హోదా దక్కింది. 2014,2019లో కనీసం 10% సీట్‌లు కూడా రాబట్టుకోలేకపోవడం వల్ల ప్రతిపక్షంగా ఉండలేకపోయింది. 






బలం పెంచుకున్న కాంగ్రెస్..


ఇక బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి 293 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. 2014 తరవాత మెజార్టీ లేకుండా మిత్రపక్షాలపై ఆధారపడి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఇండీ కూటమిలో కాంగ్రెస్‌ అత్యధికంగా 99 స్థానాలు గెలుచుకుంది. మొత్తంగా ప్రతిపక్ష కూటమి 232 స్థానాల్లో విజయం సాధించింది. 2014 తరవాత ప్రతిపక్షాలు ఈ స్థాయిలో రాణించడం ఇదే తొలిసారి. మోదీ హవాలో ఈ సారి కూడా వీళ్లకి ఓటమి తప్పదు అనుకున్నా ఎవరూ ఊహించని స్థాయిలో పుంజుకున్నాయి ఈ పార్టీలు. ముఖ్యంగా బీజేపీ కంచుకోటగా భావించిన యూపీలోనే దెబ్బ కొట్టాయి. అత్యధిక ఎంపీ స్థానాలు దక్కించుకుంది ఇండీ కూటమి. అటు మహారాష్ట్రలోనూ అదే జరిగింది. ఫలితంగా బీజేపీకి మెజార్టీ తగ్గిపోయింది. 240 స్థానాలకే పరిమితమైంది. అందుకే మిత్రపక్షాలతో కలిసి మెజార్టీ సాధించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 


Also Read: Modi Oath Taking Ceremony: అతిథి దేవోభవ, విభేదాలు పక్కన పెట్టి మాల్దీవ్స్ అధ్యక్షుడికి భారత్ ఘన స్వాగతం!