Rahul Gandhi and Solapur MP Praniti Shinde Marriage Rumors : భారత రాజకీయాల్ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాహుల్ గాంధీ. ఇప్పుడు ఈయనను యువనేత అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే 54 ఏళ్లు వచ్చాయి. అంతే వయసు ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాలుగైదేళ్ల కిందటే తాత అయ్యారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఇప్పటి వరకూ పెళ్లి కొడుకు కూడా కాలేదు. అందుకే ఆయనకు పెళ్లి చేయాలని చాలా మంది సోషల్ మీడియాలో తరచూ రూమర్స్ క్రియేట్ చేస్తూంటారు. దానికి చిన్న సందర్భం చాలు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
ఇటీవల రాహుల్ గాంధీ బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ను పరామర్శించారు. ఆ సమయంలో లాలూ రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చారు. రాహుల్ కూడా ఏమనుకున్నారో కానీ.. త్వరలో అది కూడా అయిపోతుంది అన్నట్లుగా మాట్లాడారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇప్పుడు లాలూతో రాహుల్ అన్న మాటల్ని పట్టుకుని.. అమ్మాయిని కూడా వెదికేసి..త్వరలో రాహుల్ పెళ్లి అని ప్రచారం చేసేస్తున్నారు. అ ఆమ్మాయి ఎవరో కాదు..షోలాపూర్ ఎంపీ ప్రణతి షిండే. మాజీ మహారాష్ట్ర సీఎం సుశీల్ కమార్ షిండే కుమార్తె ప్రణతి షిండే. రాహుల్ గాందీ, ప్రణతి షిండే కలిసి ఉన్న ఓ ఫోటోను పట్టుకుని అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో కొంత మంది అదే పనిగా ప్రచారం చేసేస్తున్నారు.
రాహుల్ గాంధీ లో కూడా ఇటీవల మార్పు కనిపిపిస్తోంది. పెళ్లి గురించి అడిగితే.. ఇంకా ప్లాన్ చేసుకోలేదు కానీ.. జరుగుతుందని చెబుతున్నారు. కశ్మీర్ విద్యార్థులతో ముఖాముఖి జరిగినప్పుడు అదే చెప్పారు. అందుకే రాహుల్ పెళ్లిపై ప్రచారాలు ఊపందుకుంటున్నాయి.
ఈ పెళ్లి వార్తలపై కాంగ్రెస్ కానీ.. రాహుల్ లేదా షిండే కుటుంబం కానీ ఇంకా ఖండన ప్రకటన విడుదల చేయలేదు.