Rahul Gandhi Release H Files:  కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓట్ల అక్రమాలు  జరిగాయని ఆరోపించారు. బుధవారం  మీడియా సావేశంలో  'H ఫైల్స్'  హర్యానా ఫైల్స్  అనే డాక్యుమెంట్లను విడుదల చేశారు. హర్యానాలో 25  లక్షల ఓట్ల దొంగతనం జరిగిందని ఆరోపించారు.  ఇందులో 5.21 లక్ష డూప్లికేట్ ఓటర్లు, 93,174 ఇన్వాలిడ్ వోటర్లు, 19.26 లక్లష బల్క్ ఓటర్లు ఉన్నారని ఆరోపించారు.  హర్యానా ఎలక్టోరల్ లిస్ట్‌లో 8 మందిలో ఒకరు ఫేక్ వోటర్ అని రాహుల్ తేల్చారు.  ఈ దొంగతనం ఒక్క రాష్ట్రానికి మాత్రమే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా జరుగుతోందన్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ ల్యాండ్‌స్లైడ్ విజయం సాధించాల్సి ఉండగా, BJP- ఎన్నికల సంఘం  కుట్ర ద్వారా ఓటమికి మార్చారని ఆరోపించారు.  

Continues below advertisement



ప్రెస్ మీట్‌లో రాహుల్ గాంధీ H ఫైల్స్ గురించి చెప్పారు.   హర్యానా రాష్ట్రం మొత్తం ఓట్లచోరీ ఎలా జరిగిందో పరిశీలించామని  ఇది ఒక్క నియోజకవర్గంలో కాకుండా, రాష్ట్ర,  జాతీయ స్థాయిలో జరుగుతోందన్నారు. హర్యానాలో కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఎన్నికల సమయంలో అనేక ఫిర్యాదులు వచ్చాయని, వారి అంచనాలు అన్నీ తలకిందులైపోయాయని చెప్పారు. " మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో కూడా ఇలాంటివి  జరిగాయని.., కానీ హర్యానాలో డీటెయిల్స్‌లోకి వెళ్లి పరిశోధించాం" అని రాహుల్ ప్రకటించారు.  "భారతదేశంలోని యువత,  జెన్‌జెడ్ దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినది. 100% ప్రూఫ్‌తో ప్రశ్నిస్తున్నానని" అని రాహుల్  ప్రకటించారు.  



ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాహుల్ గాంధీ ఒక సెన్సేషనల్ ఆరోపణ చేశారు. హర్యానా ఎన్నికల్లో ఒక మహిళ, బ్రెజిలియన్ మోడల్ అని తేలిన ఆమె, 10  పోలింగ్ బూత్‌లలో 22 సార్లు వోటు వేసిందని చెప్పారు. సీమా, స్వీటీ, సరస్వతి, రశ్మి, విల్మా ఇలా అనేకపేర్లతో ఓటు వేసిందని, "ఈ మహిళ ఎవరు? ఆమె పేరు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? హర్యానాలో 22 సార్లు  ఓటు ఎలా వేసింది" అంటూ ప్రశ్నలు లేవనెత్తారు.  



హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 2025లో జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ 60+ సీట్లు సాధిస్తుందని అంచనా వేశారు. BJP 48 సీట్లతో గెలిచి, మెజారిటీ పొందింది. కాంగ్రెస్ 35 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఫలితాలపై కాంగ్రెస్ మొదటి నుంచే అసంతృప్తి వ్యక్తం చేసింది. రాహుల్ ఈ 'H ఫైల్స్'ను విడుదల చేశారు. కాంగ్రెస్ వర్గాలు ఈ ఆరోపణలతో ECకు ఫిర్యాదు చేస్తామని, కోర్టులో కేసు వేస్తామని ప్రకటించాయి. BJP ఈ ఆరోపణలను "కాంగ్రెస్ ఓటమిని ఆమోదించుకోలేక డ్రామా" అంటూ తిరస్కరించింది.