Rahul Gandhi Disqualification:


ట్విటర్‌లో విమర్శలు..


రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేయడంపై ప్రియాంక గాంధీ స్పందించారు. ట్విటర్‌లో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. కోట్ల రూపాయలు దోచుకుంటున్న వాళ్లకు బీజేపీ అండగా నిలుస్తోందంటూ మండి పడ్డారు. ప్రశ్నించిన వారిపై ఇలా కేసులు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. 


"నీరవ్ మోదీ స్కామ్‌ - రూ.14,000 కోట్లు 
లలిత్ మోదీ స్కామ్‌ - రూ.425 కోట్లు
మెహుల్ చోక్సీ స్కామ్ - రూ. 13,500 కోట్లు
ఇలా దేశ సంపదను దోచుకున్న వారిని బీజేపీ ఎందుకు రక్షించాలని చూస్తోంది...? విచారణ అంటేనే ఆ పార్టీ ఎందుకు భయపడుతోంది..? వీటిపై ప్రశ్నించిన వారిపై మాత్రం కేసులు పెడుతోంది. అవినీతి పరులకే బీజేపీ సపోర్ట్ ఇస్తోందా..? " 


- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత 






పార్లమెంట్‌లో కశ్మీరీ పండిట్ కమ్యూనిటీ కించపరుస్తూ ప్రధాని మాట్లాడారని, ఆయనపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు ప్రియాంక గాంధీ. ఇదేం న్యాయం అంటూ ప్రశ్నించారు. 


"కశ్మీరీ పండిట్‌ల ఆచారం ప్రకారం..తండ్రి చనిపోయిన తరవాత కొడుకు తలపాగా చుట్టుకుంటారు. కానీ మీరు (ప్రధాని మోదీ) కశ్మీరీ పండిట్‌ల వర్గాన్ని కించపరిచారు. పార్లమెంట్ సాక్షిగా అవమానించారు. నెహ్రూ అనే ఇంటి పేరుని ఎందుకు పెట్టుకోలేదంటూ ఎగతాళి చేశారు. అప్పుడు ఏ జడ్జ్ కూడా స్పందించలేదు. మీపై అనర్హతా వేటు వేయలేదు. రాహుల్ గాంధీ నిజమైన దేశభక్తుడిగా ప్రశ్నించారు. అదానీ దేశ సంపదను దోచుకున్న విషయాన్ని ప్రస్తావించారు. పార్లమెంట్ కన్నా మీ స్నేహితుడు అదానీ మీకు ఎక్కువైపోయారా..? దీనిపై ప్రశ్నిస్తే అంత షాక్ అవ్వాలా..?"


- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత