ABP  WhatsApp

Russia-Ukraine War: అప్పటివరకు తగ్గేదేలే! ఉక్రెయిన్‌ యుద్ధంపై పుతిన్ క్లారిటీ

ABP Desam Updated at: 08 Sep 2022 05:28 PM (IST)
Edited By: Murali Krishna

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యల గురించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అప్పటివరకు తగ్గేదేలే! ఉక్రెయిన్‌ యుద్ధంపై పుతిన్ క్లారిటీ

NEXT PREV

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించి ఇప్పటికే ఆరు నెలలు పూర్తయింది. అయితే ఇప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. దీనికి అంతం ఎప్పుడనేదానిపై తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్లారిటీ ఇచ్చారు.


ఫార్ ఈస్టర్న్ పోర్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో పాల్గొన్నారు పుతిన్. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలోని ప్రజలను రక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.



లక్ష్యం సాధించే వరకు ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగుతుంది. ఆంక్షల ద్వారా రష్యాను ఒంటిరిని చేయలేరు. సైనిక చర్యను ప్రారంభించింది మేం కాదు. దాన్ని అంతం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. మా చర్యలన్నీ డాన్‌బాస్‌ వాసులకు సహాయం చేయడమే లక్ష్యంగా ఉన్నాయి. ఇది మా కర్తవ్యం. ఈ లక్ష్యాన్ని సాధించే వరకు మా చర్యలు కొనసాగుతాయి.                                                         - వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు


జిన్‌పింగ్‌తో భేటీ


రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వచ్చే వారంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. ఉబ్జెకిస్థాన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 15-16 తేదీల్లో ఉబ్జెకిస్థాన్‌లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు సమావేశమవుతారు. 


కిమ్ సాయం


మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధంలో ప్రతిఘటన ఎదురవుతుండటంతో ఉత్తర కొరియా సాయం కోరింది రష్యా. ఉత్తర కొరియా నుంచి రష్యా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నట్లు అమెరికా వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. 


ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవాలని రష్యా నిర్ణయించింది. ఇందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కూడా ఓకే చెప్పారు.


రష్యా దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల్లో ఆర్టిలరీ షెల్స్, రాకెట్స్ వంటివి ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే ఎన్ని ఆయుధాలను రష్యా దిగుమతి చేసుకుందనే విషయంపై స్పష్టత లేదు.


ఒంటరిగా





ఈ సైనిక చర్య కారణంగా రష్యా.. అంతర్జాతీయంగా దాదాపుగా ఏకాకిగా మారింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఆర్థికంగా బాగా దెబ్బ తింది. ఉక్రెయిన్‌ను వీలైనంత త్వరగా చేజిక్కించుకోవాలని యత్నించిన పుతిన్ సేనలకు ఉక్రెయిన్ చుక్కలు చూపించింది. పాశ్చాత్య దేశాల దన్నుతో ఉక్రెయిన్‌ ఇప్పటికీ దీటుగా పోరాడుతోంది. దీంతో పుతిన్ ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.




ఉక్రెయిన్‌ నెగ్గాలి


రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌ నెగ్గి తీరాలని ఈయూ చీఫ్‌ ఉర్సులా వాండెర్‌ లెయన్‌ అన్నారు. అందుకు ఐరోపా అన్నివిధాలా సాయం చేస్తుందన్నారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు పంపనున్నట్టు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ తెలిపారు. మరోవైపు బ్రిటన్ నూతన ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్.. తమకు అండగా ఉంటారని ఉక్రెయిన్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.


Also Read: CM Mamata Banerjee: '2024 ఎన్నికల్లో మోదీపై సమష్టిగా పోరాడతాం- నితీశ్‌తో కలిసే'


Also Read: Viral News: ఏ నిమిషానికి ఏమి జరుగునో- స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్!

Published at: 08 Sep 2022 05:25 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.