Punjab Man Impersonates Girl Friend: గర్ల్‌ఫ్రెండ్ కోసం ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు. ఆమె బదులుగా ఎగ్జామ్ రాశాడు. ఇందులో సాహసం ఏముంది అనుకుంటున్నారేమో..ఇక్కడో ట్విస్ట్ ఉంది. అచ్చం తన గర్ల్‌ఫ్రెండ్ లాగే తయారై ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్లాడు. కానీ..అడ్డంగా దొరికిపోయాడు. చుడీదార్ వేసుకుని, టిక్లీ, గాజులు పెట్టుకుని మరీ వెళ్లాడు. అనుమానం వచ్చి ఇన్విజిలేటర్స్ ఆరా తీస్తే అసలు విషయం అంతా బయట పడింది. జనవరి 7వ తేదీన పంజాబ్‌లో హెల్త్ వర్కర్స్ పోస్ట్‌కి ఎగ్జామ్ జరిగింది. కోట్కాపురలోని ఓ సెంటర్‌లో పరమ్‌జిత్ కౌర్ పరీక్ష రాయాల్సి ఉంది. కానీ ఆమె పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు. ఏం చేయాలో తెలియక బాయ్‌ఫ్రెండ్‌ని హెల్ప్ అడిగింది. ఆమెని ఇంప్రెస్ చేయాలని పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. అప్పటికప్పుడు గాజులు, లిప్‌స్టిక్, చుడీదార్ అన్ని కొనుక్కున్నాడు. అచ్చం గర్ల్‌ఫ్రెండ్‌లాగే తయారయ్యాడు. అంతే కాదు. ఫేక్ ఓటర్, ఆధార్ కార్డులూ క్రియేట్ చేసేశాడు. పరీక్ష రాసేది ఆ అమ్మాయే అనేంతగా నమ్మించాడు. అంతా బాగానే మేనేజ్ చేసినా చివరకు ఫింగర్‌ప్రింట్స్ దగ్గర దొరికిపోయాడు. బయోమెట్రిక్‌లో ఆ అమ్మాయి ఫింగర్‌ప్రింట్స్‌కి ఈ యువకుడి ఫింగర్‌ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు. అప్పటికి కానీ అధికారులకు అనుమానం రాలేదు. వెంటనే ఆరా తీస్తే...ఈ డ్రామా అంతా తెలిసింది. దీనిపై అధికారులు తీవ్రంగా స్పందించారు. లీగల్‌గా ఆమెపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె ఎగ్జామ్ అప్లికేషన్‌నీ రద్దు చేశారు. నిందితుడిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే...ఇది సీరియస్ విషయమే అయినప్పటికీ అలా అమ్మాయి వేషంలో ఓ యువకుడు వచ్చి ఎగ్జామ్ రాయాలనుకోవడం కొందరికి నవ్వు తెప్పించింది.