Mohammad Rizwan: పాకిస్తాన్(Pakistan) బ్యాటర్‌ మ‌హ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) అరుదైన ఘ‌న‌త సాధించాడు. పాకిస్తాన్ త‌రుపున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌(New Zealand vs Pakistan)తో జ‌రిగిన రెండో టీ20లో రిజ్వాన్‌ ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ మ్యాచులో ఆడిన మొద‌టి బంతికే సిక్స్ కొట్టిన రిజ్వాన్‌ ఈ అరుదైన రికార్డును సృష్టించాడు. మాజీ కెప్టెన్ మ‌హ్మద్ హ‌ఫీజ్ రికార్డును ఈ స్టార్‌ బ్యాటర్‌ బద్దలు కొట్టాడు. హ‌ఫీజ్ త‌న కెరీర్‌లో 76 సిక్సులు కొట్టగా 77 సిక్సుల‌తో రిజ్వాన్ మొద‌టి స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచులో రిజ్వాన్ ఏడు ప‌రుగుల‌కే ఔట్ అయ్యాడు.


పాక్‌ తరపను టీ 20ల్లో అత్యధిక సిక్సర్లు
మహ్మద్ రిజ్వాన్ –77 సిక్సర్లు
మహ్మద్ హఫీజ్ – 76
షాహిద్ అఫ్రిది – 73
షోయబ్ మాలిక్ – 69
ఉమర్ అక్మల్ – 55


పోరాడినా తప్పని ఓటమి
ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది.  హ్యామిల్టన్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో  పాక్‌ను 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఓడించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. ఫిన్‌ అలెన్‌ (41 బంతుల్లో 74;) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో అలెన్‌ మినహా ఎవరూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. లక్ష్య ఛేదనలో తడబడిన పాక్‌.. 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. కివీస్‌ పేసర్‌ ఆడమ్‌ మిల్నే నాలుగు వికెట్లతో పాక్‌ పతనాన్ని శాసించాడు. బాబర్‌ ఆజమ్‌ (66), ఫకర్‌ జమాన్‌ (50) అర్ధసెంచరీలతో రాణించినా పాక్‌కు ఓటమి తప్పలేదు. 


సిక్సులంటే రోహితే
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్‌ రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో 553 సిక్సర్లతో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్ పేరిట ఉంది. యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ పేరిట ఉన్న ఈ రికార్డును టీమిండియా సారధి రోహిత్‌ శర్మ బద్దలు కొట్టాడు. క్రిస్‌ గేల్‌ 551 ఇన్నింగ్స్‌ల్లో 553 సిక్సర్లు బాదగా... హిట్ మ్యాన్ మాత్రం కేవలం 473 ఇన్నింగ్స్‌ల్లోనే 554 సిక్సులు బాది ఆ రికార్డును బద్దలు కొట్టాడు. క్రిస్‌ గేల్‌కు.. రోహిత్‌ శర్మ మధ్య 78 ఇన్నింగ్స్‌ల తేడా ఉండడం విశేషం.



అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ప్రస్తుతం రోహిత్ దరిదాపుల్లో కూడా ఎవరూ కనపపడం లేదు. అత్యధిక సిక్సుల విభాగంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్‌కు దరిదాపుల్లో కూడా లేరు. మార్టిన్‌ గప్తిల్‌ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ 312 సిక్సర్లతో 10వ స్థానంలో, విరాట్‌ కోహ్లి 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్ ఒక్కడే 315 సిక్స్‌లతో టాప్‌ 10లో చివరి ప్లేస్‌లో ఉన్నాడు. ఈ టాప్‌ టెన్‌లో మిగిలిన బట్లర్‌, రోహిత్‌ తప్ప మిగిలిన ఆటగాళ్లందరూ రిటైర్‌ అయిపోయారు. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (283) 11 వ స్థానంలో కొనసాగుతున్నాడు.