Pune Woman Slaps Drunk Man 25 Times for Allegedly Harassing Her Inside Bus: పుణె లోకల్ బస్సలు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. బిజీ టైంలో అయితే చెప్పాల్సిన పని లేదు. ఎక్కువ మంది నిలబడే ప్రయాణిస్తూ ఉంటారు. ఇలా కిక్కిరిసిపోయి వెళ్తున్న బస్సులో అలజడి రేగింది. చూస్తే ఓ మహిళ ఓ వ్యక్తిని చితకబాదేస్తోంది. అపర కాళికలా ఉన్న ఆ మహిళ కొట్టే పిడిగుద్దులకు ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడు.
బస్సును ఆపేసి డ్రైవర్ ఏం జరిగిందా అని ఆరా తీశాడు. అతను అసభ్యంగా ప్రవర్తించాడని ఆ ప్రయాణికురాలు చెప్పింది. చూస్తే అతను తాగేసి ఉన్నాడు. తాను తప్పు చేశానని క్షమాపణలు చెప్పాడు. ఈ వీడియో వైరల్ అయింది.
ఆమె కనీసం ఆ వ్యక్తిపై పాతిక పంచ్‌లు విసిరి ఉంటుందన అంచనా. ఈ వీడియోపై నెటిజన్లు గట్టిగా స్పందిస్తున్నారు. పాతిక పంచ్‌లతోనే ఎందుకు ఆపేసిందని సమర్థిస్తున్నారు.
అయితే కొంత మంది మాత్రం అలా కొట్టడం ఏ మాత్రం సరి కాదని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని అంటున్నారు.