Telangana Tenth Exam Schedule Released: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఎస్ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకూ నిర్వహించనున్నారు.


పూర్తి షెడ్యూల్ ఇదే..



  • మార్చి 21న (శుక్రవారం) - ఫస్ట్ లాంగ్వేజ్

  • మార్చి 22న (శనివారం) - సెకండ్ లాంగ్వేజ్

  • మార్చి 24న (సోమవారం) - థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)

  • మార్చి 26న (బుధవారం) - గణితం

  • మార్చి 28న (శుక్రవారం) - సైన్స్ (ఫిజికల్ సైన్స్)

  • మార్చి 29న (శనివారం) - సైన్స్ (బయాలజీ)

  • ఏప్రిల్ 2న (బుధవారం) - సోషల్ స్టడీస్

  • ఏప్రిల్ 3న (గురువారం) - ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ - 1

  • ఏప్రిల్ 4న (శుక్రవారం) - ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ - 2


Also Read: KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ