Pulwama Widows Row:


నిరసనలు..


పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల భార్యలు రాజస్థాన్‌లో కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్‌లు నెరవేర్చేంత వరకూ పోరాటం కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. తమ కుటుంబంలో ఎవరో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే...వాళ్లు పెట్టిన కండీషన్స్‌కి గహ్లోట్ సర్కార్ ఒప్పుకోవడం లేదు. దీనిపై ఇప్పటికే జైపూర్‌లో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఇందులో బీజేపీ నేత కిరోడి లాల్ మీనా కూడా మద్దతుగా నిలిచారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆయన అరెస్ట్‌ను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు జైపూర్‌లో ఆందోళనలు చేశారు. గహ్లోట్ నివాసానికి వస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉన్నట్టుండి పరిస్థితులు అదుపు తప్పాయి. పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోర్ కూడా ఉన్నారు. 


"మేం ఇప్పుడే మా పోరాటం మొదలు పెట్టాం. మరి కొద్ది రోజుల వరకూ ఇలాగే ఆందోళనలు చేపడతాం. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని కించరపరిచే విధంగా ఉంది. రాష్ట్రంలోని అన్ని చోట్లా ప్రభుత్వంపై మా నిరసనలు కొనసాగుతాయి" 


- రాజేంద్ర రాథోర్










ఈ వివాదంపై రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ స్పందించారు. బీజేపీలో సీనియర్ లీడర్ అయిన కిడోరి లాల్ మీనాపై తమకు గౌరవం ఉందని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 


"మాకు లాల్ మీనాపై గౌరవం ఉంది. ఆయన ఎంతో అనుభవం ఉన్న నేత. ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య యుద్ధం కానే కాదు. అమర జవానల్ కుటుంబాలకు అండగా ఉంటాం. బీజేపీ కావాలనే దీన్ని రాజకీయం చేస్తోంది. బహుశా వాళ్ల అధిష్ఠానం ఇలా చేయమని ఆదేశించిందేమో"


- ప్రతాప్ సింగ్, రాజస్థాన్ మంత్రి 


Also Read: Mohit Joshi: ఇన్‌ఫోసిస్ అధ్యక్షుడు మోహిత్ జోషి రాజీనామా, 20 ఏళ్ల ప్రయాణానికి ఫుల్‌స్టాప్