Mohit Joshi: ఇన్‌ఫోసిస్ అధ్యక్షుడు మోహిత్ జోషి రాజీనామా, 20 ఏళ్ల ప్రయాణానికి ఫుల్‌స్టాప్

Mohit Joshi: ఇన్‌ఫోసిస్ ప్రెసిడెంట్ పదవికి మోహిత్ జోషి రాజీనామా చేశారు.

Continues below advertisement

Mohit Joshi Resignation: 

Continues below advertisement

రాజీనామా చేసిన మోహిత్ జోషి 

ఇన్‌ఫోసిస్ ప్రెసిడెంట్ పదవికి మోహిత్ జోషి (Mohit Joshi) రాజీనామా చేశారు. దాదాపు 20 ఏళ్లుగా ఇన్‌ఫోసిస్‌లో భిన్న పదవుల్లో ఆయన ఇంత కాలం తరవాత కంపెనీని వీడారు. టెక్‌ మహీంద్ర సంస్థలో చేరనున్నారు. మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్నారు. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌ ఈ విషయం ధ్రువీకరించింది. మార్చి 11 నుంచి మోహిత్ జోషి సెలవులో ఉంటారని, ఇన్‌ఫోసిస్‌లో ఆయన లాస్ట్ వర్కింగ్ డే జూన్ 9 అని ప్రకటించింది. ఇన్నాళ్లు యూరప్‌లో ఈ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్‌ను లీడ్ చేశారు మోహిత్. 2007లో మెక్సికోలోని ఇన్‌ఫోసిస్‌కు సీఈవోగా అపాయింట్ అయ్యారు. అవీవాలోని కంపెనీకి కూడా ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. Risk & Governance and Nomination కమిటీలలో సభ్యుడిగానూ ఉన్నారు. ఇంత కీలకంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కంపెనీని వీడుతుండటం వల్ల ఇన్‌ఫోసిస్‌లో ఆ లోటు కచ్చితంగా కనిపిస్తుంది అంటున్నారు టెక్‌ నిపుణులు. నిజానికి ఆయనను రిటైన్ చేసుకునేందుకు చాలానే ప్రయత్నించింది కంపెనీ. కానీ...ఆయన కాస్త పెద్ద పదవి ఇవ్వాలని అడిగారని, కానీ అందుకు కంపెనీ అంగీకరించలేదని తెలుస్తోంది. ఫలితంగా ఆయన టెక్‌ మహీంద్రకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దాదాపు ఐదేళ్ల పాటు టెక్‌ మహీంద్ర ఎమ్‌డీ, సీఈవోగా ఉండనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 20 నుంచి 2028 డిసెంబర్ 19 వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 

"ఇవాళే మోహిత్ జోషి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మార్చి 11 నుంచి ఆయన సెలవులో ఉంటారు. జూన్ 9వ తేదీన ఆయన లాస్ట్ వర్కింగ్ డే. ఇన్నాళ్ల పాటు ఆయన కంపెనీకి అందించిన సేవలను బోర్డ్ మెంబర్స్ ప్రశంసించారు. సంస్థకు ఎన్నో కంట్రిబ్యూట్ చేశారని కితాబునిచ్చారు"

- బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్

2014లో Global Young Leader కార్యక్రమంలో పాల్గొనాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) మోహిత్ జోషికి ఆహ్వానం పంపింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి MBA పట్టా పొందిన జోషి..గతంలో ANZ Grindlays, ABN AMRO సంస్థల్లో పని చేశారు. 

Continues below advertisement