ఎస్‍బీఐ క్లర్క్ మెయిన్-2022 పరీక్ష ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో పొందుపరిచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనవరి 15న మెయిన్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.


SBI Clerk Main Exam Results చూసుకోండిలా..


➥ అభ్యర్థులు ముందుగా బ్రౌజర్‌లో ఎస్‍బీఐ.కో.ఇన్ (sbi.co.in) వెబ్‍సైట్‍కు వెళ్లాలి.


➥ అనంతరం వెబ్‍సైట్ హోమ్ పేజీలో కెరీర్స్ (Careers) ట్యాబ్‍పై క్లిక్ చేయాలి.


➥ అక్కడ ఎస్‍బీఐ క్లర్క్ మెయిన్ రిజల్ట్స్ 2022 అనే లింక్ కనిపిస్తుంది.


➥ ఆ లింక్‍పై క్లిక్ చేసి.. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్/ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.


➥  లాగిన్ వివరాలు ఎంటర్ చేశాక.. రిజల్ట్స్ స్క్రీన్‍పై కనిపిస్తాయి.


➥ భవిష్యత్తు అవసరాల కోసం ఆ రిజల్ట్స్ ను డౌన్‍లోడ్ చేసుకొని.. ప్రింట్ అవుట్ తీసుకోవాలి.


ఫలితాల కోసం క్లిక్ చేయండి..



దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో 5,008 ఖాళీల భర్తీ కోసం గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 12న క్లరికల్ క్యాడర్‌లోని జూనియర్ అసొసియేట్ (కస్టమర్ సపోర్ట్& సేల్స్) పోస్టుల కోసం ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 15న మెయిన్ పరీక్ష నిర్వహించారు. తాజాగా మెయిన్ పరీక్ష ఫలితాలను ఎస్‍బీఐ వెల్లడించింది. 


SBI Clerks 2022 నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


Also Read:


ఎస్‌బీఐ పీవో మెయిన్స్‌-2022 ఫలితాలు విడుదల, ఇక్కడ చూసుకోండి!
దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన పీవో మెయిన్స్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్ మార్చి 10న ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది. ప్రిలిమ్స్ ఉత్తీర్ణులకు జనవరి 30న మెయిన్ ఎగ్జామినేషన్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఫేజ్-3కి సంబంధించి సైకోమెట్రిక్ టెస్టుకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఎస్‌బీఐ తాజాగా ప్రకటించింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులు గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఎల్‌ఐసీ ఏఏవో ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడి, మెయిన్ పరీక్షకు 7,754 మంది అభ్యర్థులు ఎంపిక!
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (ఏఏవో) పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఎల్‌ఐసీ మార్చి 10న విడుదల చేసింది. ఫలితాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 7,754 మంది అభ్యర్థులు ప్రధాన (మెయిన్) పరీక్షకు ఎంపికయ్యారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మార్చి 18న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...