మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు ఉపాసన (Upasana) వివాహం ఎప్పుడు జరిగిందో గుర్తు ఉందా? జూన్ 14, 2012లో వాళ్ళిద్దరి పెళ్లి జరిగింది. వివాహమైన పదకొండేళ్లకు వాళ్లిద్దరూ తల్లిదండ్రులు కానున్నారు.


ఉపాసన గర్భవతి అని గత ఏడాది మెగా ఫ్యామిలీ అనౌన్స్ చేసింది. అప్పుడు చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. నిజంగా ప్రెగ్నెంటా? లేదంటే సరోగసీ విధానాన్ని ఆశ్రయిస్తున్నారా? అని! ఎందుకంటే... తెలుగులో లక్ష్మీ మంచు, తమిళంలో నయనతార, హిందీలో షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, శిల్పా శెట్టి వంటి స్టార్స్ సరోగసీ ద్వారా సంతానాన్ని పొందారు. అందుకని, ఉపాసన విషయంలో డౌట్స్ వ్యక్తం చేశారు. అయితే, ఆ ప్రచారం పట్ల ఆమె ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఉపాసన పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తుంటే అనుమానాలు అన్నిటికీ సమాధానం చెప్పినట్లు అయ్యింది. 


ఉపాసన బేబీ బంప్ ఫోటోలు!
ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కోసం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు. మొదట ఆయన ఒక్కరే అక్కడికి వెళ్లారు. తర్వాత కొన్ని రోజులు ఉపాసన కూడా అమెరికా వెళ్లారు. ప్రియాంకా చోప్రా ఇచ్చిన పార్టీకి రామ్ చరణ్, ఉపాసన దంపతులు హాజరు అయ్యారు. అంతకు ముందు షాపింగ్ చేశారు. ఆ ఫోటోలు అన్నీ చూస్తే ఒక్కటి స్పష్టంగా కనబడుతోంది. ఉపాసన బేబీ బంప్ ఫోటోలు! సో... ఆమె ప్రెగ్నెన్సీ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు.  


Also Read : ఆ బూతులు, సెమీ న్యూడ్ సీన్లు ఏంటి? - తెలుగు ప్రేక్షకులకు 'రానా నాయుడు' షాక్






ఉపాసన డెలివరీకి ఫేమస్ అమెరికన్ గైనకాలజిస్ట్!
ఇండియాలో, అపోలో ఆస్పత్రిలో ఉపాసన డెలివరీ ఏర్పాట్లు చేశారు. గత నెలలో... ఫిబ్రవరి 22న 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో పాల్గొన్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా, అందులోని 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం, ఆస్కార్ నామినేట్ కావడం వంటి అంశాలతో పాటు షోలో రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. త్వరలో ఆయన తండ్రి కానున్న నేపథ్యంలో ఆ ప్రస్తావన కూడా వచ్చింది.


అమెరికాలోని ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో కో హోస్ట్! ఆమెను కలవడం సంతోషంగా ఉందని చెప్పిన చరణ్... ఫోన్ నంబర్ తీసుకుంటానని పేర్కొన్నారు. తన భార్య (ఉపాసన) అమెరికా వస్తుందని, డెలివరీకి తమరు అందుబాటులో ఉంటే బావుంటుందని జెన్నిఫర్ ఆస్టన్ (Jennifer Ashton) తో చరణ్ తెలిపారు. అందుకు జెన్నిఫర్ ఒకే అన్నారు. ''మీతో ట్రావెల్ చేయడానికి రెడీ. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడం నాకు గౌరవమే'' అని ఆమె పేర్కొన్నారు.


జెన్నిఫర్ ఆస్టన్ టూ స్వీట్ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. త్వరలో ఆమెను కలవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇండియాలోని అపోలో ఆస్పత్రుల కుటుంబంలో డాక్టర్లు సుమనా మనోహర్, రూమా సిన్హాతో కలిసి డెలివరీ చేయమని రిక్వెస్ట్ చేశారు. అందుకు జెన్నిఫర్ ఓకే చెప్పారు. సో, అపోలోలో ఉపాసన డెలివరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నమాట. అదీ సంగతి!


Also Read : మగువ మీద మదము చూపే జన్మ దేనికి? - మృగాళ్లను ప్రశ్నించిన పాట