Police Case Against Viveka Daughter and Son in Law and CBI SP in Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి (Vivekanada Reddy) హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పులివెందుల (Pulivendula) పోలీసులు వివేకా కుమార్తె సునీత (Sunitha), ఆమె భర్త రాజశేఖర రెడ్డి (Rajasekhar Reddy), కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రాంసింగ్ (Ramsingh) పై కేసు నమోదు చేశారు. వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన పీఏ కృష్ణారెడ్డి 2021, ఫిబ్రవరిలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అధికారులు కొందరి నేతల పేర్లు చెప్పాలని తనను బెదిరిస్తున్నట్లుగా కోర్టు దృష్టికి తెచ్చారు. వివేకా హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్ బెదిరింపులకు పాల్పడ్డారని పిటిషన్ లో వివరించారు. సీబీఐ అధికారులకు అనుకూలంగా వ్యవహరించాలని వివేకా కుమార్తె, అల్లుడు కూడా తనను బెదిరించారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని అప్పట్లో ఎస్పీగా ఉన్న అన్బురాజన్ ను కలిసి వినతిపత్రం అందజేశానని వివరించారు. రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా ఫలితం లేకపోవడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు, కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారించి వివేకా కుమార్తె, అల్లుడు, సీబీఐ ఎస్పీలపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఐపీసీ సెక్షన్ 156 (3) కింద పోలీసులు ముగ్గురిపై ఈ నెల 15న కేసు నమోదు చేశారు.


Also Read: Chandrababu Pawan Meeting: పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు కీలక భేటీ, చర్చించిన అంశాలివే! టార్గెట్ ఫిక్స్