Amritpal Singh News:


పపల్ ప్రీత్ సింగ్ అరెస్ట్..


ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ సన్నిహితుడు పపల్ ప్రీత్‌ సింగ్‌ (Papalpreet Singh Arrest)ను పోలీసులు అరెస్ట్ చేశారు. హోషియార్‌పూర్‌లో పంజాబ్ పోలీసులు ఢిల్లీ పోలీసులతో కలిసి  జాయింట్ ఆపరేషన్ నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మార్చి 18 నుంచి అమృత్ పాల్ సింగ్, పపల్‌ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నారు. చాలా చోట్ల ఇద్దరూ కలిసే తిరిగినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే..హోషియార్‌పూర్‌లో మాత్రం ఎవరికి వాళ్లు వేరు వేరు దారుల్లో వెళ్లినట్టు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ చేసిన పోలీసులు పపల్ ప్రీత్‌ను అరెస్ట్ చేశారు. అమృత్‌ పాల్‌కి రైట్‌ హ్యాండ్‌ అయిన పపల్ ప్రీత్‌ అరెస్ట్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే..ABP News సోర్సెస్ ప్రకారం..పపల్‌ ప్రీత్ సింగ్ తన కుటుంబంతో కొన్ని కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. "అమృత్ పాల్ సింగ్ ఇలా తప్పించుకుని తిరుగుతూ బాగా అలిసిపోయాడు. అందుకే తాను ఎక్కడున్నది కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆ తరవాతే పోలీసులకు వీడియో పంపాడు. పోలీసులు పట్టుకోలేకపోతే తనంతట తానుగా లొంగిపోతాడు" అని పపల్ ప్రీత్ తన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం.