President Biden Joke:  


స్పెషల్ డిన్నర్ 


అమెరికాలోని వైట్‌హౌజ్‌లో అధ్యక్షుడు స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశారు. మరోసారి అధ్యక్షుడిగా తానే ఎన్నికవుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే బైడెన్ తనపై తానే సెటైర్లు వేసుకున్నారు. తన ఏజ్‌పై జోక్‌లు చెప్పి అందరినీ నవ్వించారు. తన వయసుని ఉద్దేశిస్తూ కొందరు చేసిన కామెంట్స్‌కి గట్టిగా సమాధానమిచ్చారు. రాజకీయ ప్రముఖులంతా హాజరైన ఆ మీటింగ్‌లో కాసేపు నవ్వులు పూయించారు. రెండోసారి ఎన్నికలు పోటీ చేసే ఓపిక బైడెన్‌కు లేదంటూ ఇటీవల కొన్ని మీడియా సంస్థలు ఆయనపై విమర్శలు చేశాయి. ముఖ్యంగా Fox News బైడెన్‌కు వ్యతిరేకంగా కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది.  దీనిపై స్పందించిన బైడెన్..అబద్ధాలు చెబుతూ వ్యాపారం చేసుకుంటున్నారని మండి పడ్డారు. ఫాక్స్ న్యూస్‌ని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 


"లాభాల కోసమో, అధికారం కోసమో ఇలాంటి అబద్ధాలు చెబుతూనే ఉంటారు. హింసను, విద్వేషాన్ని పెంచి పోషించాలనుకునే వాళ్లే ఇలా పదేపదే అబద్ధాలు చెబుతుంటారు. ప్రజల్ని రెచ్చగొడుతుంటారు. ఫాక్స్ న్యూస్‌ అదే చేస్తోంది. ఒకవేళ నేను ఫాక్స్ న్యూస్ చాలా నిజాయతీగా పని చేస్తోందని, నిజాలే చెబుతోందని అని అన్నా నాపై వాళ్లు పరువు నష్టం దావా వేస్తారేమో"


- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు 


ఇదే స్పీచ్‌లో ఫాక్స్ న్యూస్ ఓనర్‌పైనా సెటైర్లు వేశారు బైడెన్. నన్ను యంగ్‌గా చూడాలనుకుంటున్న అలాంటి వ్యక్తిపై నాకు కోపం రావట్లేదని చతురులు విసిరారు. 


"మీరంతా ఫాక్స్ న్యూస్ ఓనర్ అంటే నాకు నచ్చదని అనుకుంటున్నారేమో. అది ఏ మాత్రం నిజం కాదు. నన్నో కుర్రాడిలా చూడాలన్న ఆయన తపన పడుతున్నారు. అలాంటి వ్యక్తిపై నాకెందుకు కోపం ఉంటుంది..? నాకు వయసైపోయిందని మీరంటున్నారు. నేను పరిస్థితులకు అనుకూలంగా మారే వ్యక్తిని అని నేనంటున్నాను. నా ఆలోచనలు పాతపడిపోయాయని మీరంటున్నారు..కానీ నేను మాత్రం చాలా తెలివిగల వాడినే అని ఫీల్ అవుతున్నాను. ఏదేమైనా జర్నలిజం అనేది నేరం కాదు. పత్రికా స్వేచ్ఛకు మేమెప్పుడూ సపోర్ట్‌గానే ఉంటాం"


- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు 


ఇటీవల ఓ జర్నలిస్ట్ బైడెన్‌పై విమర్శలు చేశారు. ఫ్రాన్స్‌లో కొందరు రిటైర్‌మెంట్ ఏజ్‌ని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారని, కానీ అమెరికాలో మాత్రం 80 ఏళ్ల వ్యక్తి మరోసారి అధ్యక్షుడు కావాలని కలలు కంటున్నారని విమర్శించారు.  


"ఫ్రాన్స్‌లో రిటైర్‌మెంట్ ఏజ్ పెంచారు. దానిపై అక్కడి ప్రజలు నిరసనలు చేస్తున్నారు. 64 ఏళ్ల వరకూ పని చేయాలని అక్కడి వాళ్లు అనుకోడం లేదు. కానీ అమెరికా పరిస్థితి చూడండి. 80 ఏళ్ల వ్యక్తి మరోసారి నాకు అధ్యక్షుడిగా పనిచేసే అవకాశమివ్వండి అని అడుగుతున్నారు. మాకు ఇది కావాలని మీరు ఎన్నైనా అడగండి. ఆయన నిద్ర లేస్తేనే కదా ఆ పనులన్నీ అయ్యేది"


- ఓ జర్నలిస్ట్ 


ఈ వ్యాఖ్యలపైనే బైడెన్ సెటైర్లు వేశారు. ఈసారి కూడా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్నట్టు ప్రకటించారు. 


Also Read: Texas Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత, 8 ఏళ్ల చిన్నారి సహా ఐదుగురు మృతి