Pregnant Canadian Woman's Post: 


సుదీర్ఘమైన పోస్ట్..


ఇండియా నుంచి వెళ్లి విదేశాల్లో స్థిరపడిన వాళ్లు చాలా మందే ఉన్నారు. కష్టమనిపించినా సరే..కుటుంబాన్ని వదిలి ఇతర దేశాల్లో జీవనం సాగిస్తున్నారు. ఫారిన్‌లో ఉంటున్నారని చెప్పుకోడానికి బాగానే ఉన్నా...అక్కడి వాళ్ల కష్టాలు వాళ్లకుంటాయి. ఓ కెనడా మహిళ కథ వింటే...అది అర్థమైపోతుంది. సోషల్ మీడియా సైట్ Redditలో తన బాధనంతా చెప్పుకుంటూ ఓ పెద్ద పోస్ట్ పెట్టింది ఆ మహిళ. ఈ కెనడా మహిళ ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. మరి కొద్ది వారాల్లో డెలివరీ కానుంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది ఈ జంట. "బిడ్డ పుట్టాక ఖర్చులు పెరుగుతాయి. ఎలా మేనేజ్ చేసుకునేది" అని కలవర పడుతుంటే...వాళ్ల అత్తమామలు గొంతెమ్మ కోరికలు తీర్చాలని పట్టుపడుతున్నారట. ఇదే విషయాన్ని పోస్ట్ చేసింది ఆ మహిళ. "మరి కొద్ది రోజుల్లో డెలివరీ అవుతాను. కానీ..నా భర్త అమ్మ, నాన్నలు మాత్రం మాకు ఐఫోన్లు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు" అని చెప్పింది. "నా సమస్యేంటో అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. నాది  కెనడా. నా భర్త ఇండియన్. మేం ప్రస్తుతానికి కెనడాలో ఉంటున్నాం. నా భర్త వాళ్ల అమ్మనాన్నలు ఇండియాలో ఉన్నారు. మేం కెనడాలో ఉన్నామంటే కచ్చితంగా మేము రిచ్ అని వాళ్లు ఫీల్ అవుతున్నారు. కానీ నిజమేంటంటే...మా దగ్గర వాళ్లనుకుంటున్నంత డబ్బు లేదు. బిడ్డ పుట్టాక ఖర్చులెలా అని టెన్షన్ పడుతున్నాం. కానీ...వాళ్లు అది అర్థం చేసుకోవడం లేదు. 2 ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇవ్వాలని అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నా భర్త "వాళ్లకు కొనిద్దాం అని అంటున్నాడు. ఇదే నాకు షాకింగ్‌గా ఉంది" అని పోస్ట్ చేసింది. 


చివరకు ఇలా నిర్ణయించారు..


ఈ పోస్ట్‌ చదివిన వాళ్లు రకరకాల కామెంట్ల్ పెట్టారు. కొందరు సలహాలు ఇవ్వగా...మరికొందరు ఆమె అత్తమామలను విమర్శించారు. "పుట్టే బిడ్డ కన్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుంది. ఇదే విషయం వాళ్లకు చెప్పండి" అని కొందరు కామెంట్ చేశారు. "ఇలాంటి వాళ్లను నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ చూస్తున్నా. ఒకవేళ వాళ్లకు ఐఫోన్‌లు ఇవ్వాలని మీ భర్త అనుకుంటే...సెకండ్ హ్యాండ్‌వి దొరుకుతాయి. అవి గిఫ్ట్‌గా ఇచ్చేయండి. ఇలా చేస్తే మీరు చాలా డబ్బు సేవ్ చేసుకోవచ్చు" అని నెటిజన్ సలహా ఇచ్చాడు. ఈ సలహాలన్నీ చూసిన ఆ మహిళ...ఆ తరవాత మరో పోస్ట్ పెట్టింది. "నా భర్త నేను మాట్లాడుకుని ఓ కాంప్రమైజ్‌కు వచ్చాం. చాలా మంది ఇచ్చిన సలహా మేరకు కాస్త తక్కువ ధరవి, సెకండ్ హ్యాండ్‌ ఫోన్‌లు కొనాలనుకుంటున్నాం. అయితే...వాళ్లు అనుకుంటున్నట్టుగా ఐఫోన్‌లు అయితే కాదు. వేరే బ్రాండ్‌వి కొంటాం. వాళ్లు అడిగినట్టుగా ఇండియాకు గిఫ్ట్‌గా పంపుతాం" అని పోస్ట్ చేసింది. ఇలా ఆ కథ ముగిసింది. నిజానికి ఈ సమస్య ఈ మహిళది మాత్రమే కాదు. ఫారెన్‌లో ఫ్రెండ్స్‌ ఉన్నా, రిలేటివ్స్‌ ఉన్నా...iPhone కావాలంటూ తెగ ఇబ్బంది పెట్టేస్తుంటారు కొందరు. యూఎస్‌ నుంచి ఇండియాకు వచ్చేప్పుడు చాలా మంది ప్రయాణికులు ఐఫోన్లనే తీసుకొస్తుంటారు. 


Also Read: Women Trapping Men: హనీట్రాప్‌ అంటే ఏమిటి? శృంగారాన్ని ఆయుధంగా వాడుతున్న యువతులు - ఎక్కువ మోసపోతుంది వాళ్లేనట!