అందాన్ని ఎరగా వేస్తారు.. మాటలు కలిపి మైమరచిపోయేలా స్కిన్ షో చేస్తారు. ఆ టైమ్‌లో ఎదుటివాళ్లు టెంప్ట్ అయినా.. కాకపోయినా కూల్‌గా వాళ్ల పని వాళ్లు కానిచ్చేస్తారు. ఆ తర్వాత అసలు సిసలు కథ నడిపిస్తారు. డబ్బులిస్తావా..? మీ పరువు బజారుకీడ్చాలా? అని పచ్చిగా పచ్చనోట్లు డిమాండ్ చేసి, బరితెగింపులకు దిగడం ఓ రకమైన హనీట్రాప్‌. హాలో హాయ్‌... అంటూ హస్కీ వాయిస్‌తో అమ్మాయి నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తాయి. ఆ వాయిస్‌ విని కొందరు గింగిరాలు తిరిగేస్తుంటారు. సన్నగా నవ్వి.. కప్పుకాఫీ అనికి పిలిస్తే.. లొట్టలేసుకుంటూ వెళ్లి, అడ్డంగా బుక్కవుతుంటారు. అయితే ఈ హనీట్రాప్‌లో కేవలం యువత మాత్రమే కాదు.. అంకుల్స్‌ సైతం పడుతున్నారు.


ఏజ్‌ ఏంటీ, గేజ్ ఏంటన్న విషయం మరిచిపోయి మరీ, అమ్ముడు లెట్స్‌ డూ కుమ్ముడు అనే రేంజ్‌లో రెడీ అవుతుంటారు. కానీ కిలాడీ లేడీలా.. రెండో వైపు సీన్‌ వేరే లెవల్లో ఉంటుందన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతారు. హనీట్రాప్‌ పేరుతో ఇలా కవ్వించి, కన్నింగ్‌కు పాల్పడుతున్న ఘటనలో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి హనీట్రాప్‌ కేసులు ఎక్కువ అయ్యాయి. ఇలా హనీట్రాప్‌లో పడుతున్న వారిలో ఎక్కువగా కాలేజ్‌ యువకులు ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో అంకుల్స్‌ ఉంటున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా మన దేశంలో పలు రాష్ట్రాల్లో వినిపిస్తున్న సమస్య హనీట్రాప్.


హనీట్రాప్‌ అంటే ఏమిటి ? 
ఒక వ్యక్తితో రొమాంటిక్ లేదా సెక్సువల్ సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని రాబట్టడాన్ని‘హనీ ట్రాప్’ అంటారు. ఈ మధ్య కాలంలో మనం తరుచుగా హనీట్రాప్‌ అనే పేరును వింటూనే ఉన్నాం. మొదట అమాయకుల్ని అందచందాలతో తమ వైపు లాక్కోవడం.. ఆ తరువాత వారితో వీడియో కాల్ చేయడం, ఆపై వాళ్ల న్యూడ్‌ వీడియోస్‌ రికార్డ్‌ చేసి, డబ్బులు డిమాండ్‌ చేయడం అనేది కామన్‌ అయిపోయింది. ఎక్కడ చూసినా ఇదే రకమైన ఘటనలు వెలగులోకి వస్తున్నాయి. మనుషుల బలహీనతలను, ఆశనే పెట్టుబడిగా పెట్టి హనీట్రాప్‌ నేరాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. ఈ రకమైన మోసాలు ప్రస్తుతం ఎక్కువయ్యాయి. అప్రమత్తంగా లేకుంటే డబ్బులు పోవడంతో పాటు, పరువు, ప్రతిష్టలకు భంగం కలగక తప్పదు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, ఉద్యోగులే లక్ష్యంగా మహిళల పేరుతో ఈ నేరాలకు దిగుతున్నారు. మొదట న్యూడ్‌ వీడియోలు పంపించి.. ఆ తర్వాత మార్ఫింగ్‌లు చేస్తారు. డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తారు. చివరకు బయటకు చెప్పుకోలేక ట్రాప్‌లో పడేవారు కొందరైతే.. ఆత్మహత్యలకు పాల్పడేవారు మరికొందరు. 


సెక్స్‌ను ఓ ఆయుధంగా వాడుకోని మరీ మోసాలు.!
హనీ ట్రాప్‌ అనే.. పేరు కొత్తగా ఉందేమో కానీ.. మహిళల ద్వారా రహస్యంగా సమాచారం రాబట్టి, మోసాలకు పాల్పడటం అనే పురాతన కాలం నుంచే వస్తోంది. గూఢచర్యాం చేసేందుకు ఆటాపాటా బాగా తెలిసి ఉండి, కళల్లో ఆరితేరిన మహిళలను మాత్రమే ఉండేవారంటా.! రెండో ప్రపంచయుద్ధం సమయంలోనూ శత్రు దేశాల యుద్ధవ్యూహాలు తెలుసుకునేందుకు హనీ ట్రాప్ ఏజెంట్లను ఉపయోగించారు. అలా ప్రారంభమైన హనీట్రాప్‌లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక భారత్‌లోనూ హనీట్రాప్‌ ఘటనలు చాలానే జరిగాయి. ఇక కొద్ది నెలల క్రితం.. ఏకంగా భారత సైనికులకు, అధికారులకు వలపు వల విసిరి వారిర నుంచి రహస్య సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు పాకిస్తాన్‌కు చెందిన కొంత కిలాడీ లేడీలు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐ పన్నిన హనీ ట్రాప్‌లో పడి భారతదేశానికి సంబంధించిన సీక్రెట్‌ సమాచారాన్ని ఆ దేశానికి ఇచ్చారనే ఆరోపణల మీద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.


హనీట్రాప్‌లో పడుతున్న యువకులు, అంకుల్స్‌:
ఈ మధ్య కాలంలో హనీట్రాప్‌లో పడితున్న ఎక్కువ మందిలో కాలేజ్‌ యువకులు మొదటి స్థానంలో ఉంటే.. రెండో స్థానంలో ఉన్నది అంకుల్స్‌ అంటా. ఒంటరిగా జీవితం గడుపుతున్న అంకుల్స్‌ ఎక్కువగా ఈ హానీ ట్రాప్‌లో పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక మొన్నటికి మొన్న పంజాబ్‌లో తీవ్ర కలకలం రేపిన ఈ హానీ ట్రాప్‌ అండ్ కిడ్నాపింగ్‌లో కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హానీ ట్రాప్‌ కిలాడీ రాఖీ అనే యువతి, ఫేస్‌బుక్‌లో ఫేక్‌ ప్రొఫైల్ క్రియేట్‌చేసి ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ భూమ్లాను ట్రాప్‌ చేసింది. ఆమె మాటలు నమ్మి కలిసేందుకు బయల్దేరిన భూమ్లాను తన గ్యాంగ్‌తో కిడ్నాప్‌ చేయించింది రాఖీ. ఆ తర్వాత మత్తు మందు ఇచ్చి, రంజిత్‌నగర్‌లోని తన ఫ్లాట్‌లో కట్టిపడేసింది. ఆ తర్వాతే అసలు గేమ్‌ మొదలుపెట్టింది. భూమ్లా పేరెంట్స్‌కి ఫోన్‌చేసి మీ అబ్బాయ్‌ని కిడ్నాప్‌ చేశాం, రూ. 50లక్షల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది.


భూమ్లా తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్‌తో రెండ్రోజుల సెర్చ్‌ ఆపరేషన్‌ తర్వాత ఆ యువకుడిని సేఫ్‌గా కాపాడారు పోలీసులు. రంజిత్‌నగర్‌లోని రాఖీ ఫ్లాట్‌లో కట్టిపడేసిన భూమ్లాను రక్షించారు. అనంతరం, హానీ ట్రాప్‌ కిలాడీ లేడీ రాఖీతోపాటు నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్‌ చేశారు పోలీసులు. నిందితుల నుంచి హోండా సిటీ కారును , పిస్టల్‌తో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ హానీ ట్రాప్‌ కేసును ఛేదించడానికి మూడు జిల్లాల పోలీసులు రెండ్రోజులపాటు కష్టపడాల్సి వచ్చింది. అంబాలా, హరిద్వార్‌, ఘజియాబాద్‌ జిల్లాల పోలీసులు సమన్వయంతో పనిచేసి ఈ హనీట్రాప్‌ ముఠా గుట్టు రట్టు చేశారు.