Prashant Kishor Bihar Campaign:
చెప్పినట్టు చేస్తే మద్దతునిస్తాను: పీకే
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బిహార్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితీష్ ప్రభుత్వం వచ్చే ఏడాది, రెండేళ్లలో 5-10 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగితే తన "జన్ సూరజ్ అభియాన్" యాత్రను నిలిపివేస్తానని అన్నారు పీకే. అదే జరిగితే మహాఘట్‌బంధన్‌కు మద్దతు నిస్తాననీ చెప్పారు. సమస్తిపూర్‌లో అనుచరులతో మాట్లాడే సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. "బిహార్ ప్రత్యక్ష ఎన్నికల్లోకి నేను అడుగు పెట్టి మూడు నెలలు అవుతోంది. ఈ మధ్యే ఇక్కడి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. భవిష్యత్‌లో ఇంకెన్నో మార్పులు చూడాల్సి ఉంటుంది" అని అన్నారు ప్రశాంత్ కిశోర్. ఆర్‌జేడీ, జేడీ(యూ) ప్రభుత్వానికి ప్రజల్లో మద్దతు లేదని అన్నారు. "సీఎం కుర్చీకి అతుక్కు పోవటానికి నితీష్ కుమార్ ఫెవికాల్ వాడుతున్నారు. మిగతా పార్టీలు ఆ కుర్చీ చుట్టూ తిరుగుతున్నాయి" అని కామెంట్ చేశారు. డిప్యుటీ సీఎం పదవిని చేపట్టాకు తేజస్వీ యాదవ్ ఓ ప్రకటన చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 10 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చుతామని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం నితీష్ కుమార్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. "రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. యువతరం మా వెంటే ఉంది. వారితో కలిసి కొత్త ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాం. అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో బిహార్‌కు చోటు కల్పించాలన్నదే మా లక్ష్యం" అని నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
భాజపా పావులు
జేడీయూతో మళ్లీ కలిసేదే లేదని గతంలోనే తేల్చి చెప్పిన RJD చీఫ్ తేజస్వీ యాదవ్...ఉన్నట్టుండి రూట్ మార్చారు. మళ్లీ పాతమైత్రికే జైకొట్టారు. నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా, తేజస్వీ యాదవ్ డిప్యుటీ సీం పదవిని చేపట్టారు. భాజపాను లక్ష్యంగా చేసుకునే ఇద్దరు నేతలు విభేదాలు మరిచి మళ్లీ కలిశారని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటు కాంగ్రెస్ శ్రేణులూ సోనియా గాంధీ వల్లే ఇదంతా సాధ్యమైందని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే భాజపా అప్రమత్తమైంది. టార్గెట్ 2024లో భాగంగా బిహార్‌లో జరిగిన ఈ రాజకీయ మార్పుని జాగ్రత్తగా గమనిస్తోంది. ఏ వ్యూహంతో ముందుకెళ్లాలనే ఆలోచనలో పడింది. నితీష్, తేజస్వీని ఢీకొట్టే ప్లాన్‌ను సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం అధికారాన్ని కోల్పోయినందుకు భాజపా పైకి బాధ పడుతున్నప్పటికీ...ప్రత్యర్థులతో ప్రత్యక్షంగా పోరాడేందుకు ఇదో మంచి అవకాశం అని భావిస్తోంది. ఎవరి అండ లేకుండా ఏకపక్షంగా గెలిచి బిహార్‌పై పట్టు సాధించాలని చూస్తోంది. ఇన్నాళ్లూ నితీష్ కుమార్ వల్లే తమ పార్టీ ఇక్కడ బలంగా నిలబడలేకపోయిందన్న భావన కాషాయ వర్గాల్లో ఉంది. ఇప్పుడు లైన్ కూడా క్లియర్ అవటం వల్ల ముఖాముఖి పోరుకు పావులు కదుపుతోంది. ఆర్‌జేడీ, జేడీయూ కలిసి కట్టుకున్న కోటను కూల్చటమే భాజపా తక్షణ కర్తవ్యం. బిహార్‌లో ప్రభుత్వం మారిన వెంటనే భాజపా కోర్ కమిటీ సమావేశమైంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ జైస్వాల్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో చర్చించారు. తదుపరి వ్యూహాలపై ప్రణాళికలు రచించారు.
Also Read: Viruman: ప్రభాస్ ఫ్లాప్ సినిమా పాయింట్‌తో కార్తీ సినిమా - సూపర్ హిట్ అయిందే!