Prashant Kishor On Nitish Kumar: 


నితీష్‌ వర్సెస్ పీకే 


ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై...బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ విమర్శలు చేశారు. జేడీయూ మాజీ నేత...ప్రశాంత్ కిషోర్...భాజపాకు సహకరించే పనిలో ఉన్నారని ఆరోపించారు. దీనిపై...పీకే స్పందించారు. ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. నితీష్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ పక్కపక్కనే ఉన్న ఫోటోలను ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకుండానే షేర్ చేశారు. ఆ ఫోటోల్లో నితీష్ ప్రధాని మోదీకి చేతులు జోడిస్తూ అభివాదం చేస్తున్నారు. ఏమైందో తెలియదు కానీ...ఈ ఫోటోలను పోస్ట్ చేసిన కాసేపటికే మళ్లీ డిలీట్ చేశారు  పీకే. దీనంతటికీ కారణం ఏంటి అని ఆరా తీస్తే...ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ అని తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా...బిహార్ సీఎం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా...కొందరు ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన జేడీయూలో చేరి మళ్లీ ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగానే...నితీష్...పీకేపై విమర్శలు చేశారు. ఆయన భాజపాకు సహకరించే పనిలో పడ్డారని ఆరోపించారు. నితీష్ కామెంట్స్‌ని సీరియస్‌గా తీసుకున్నారు పీకే. నితీష్ పేరు ప్రస్తావించకుండానే...ఈ వ్యాఖ్యలకు ఎలాంటి అర్థం లేదని, 2005 నుంచి రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని సవాల్ చేశారు. "పీకే మా పార్టీలో చేరినప్పుడే...మిగతా పనులన్నీ పక్కన పెట్టేయాలని చెప్పాను. కానీ...ఆయన పట్టించు కోలేదు. మిగతా పార్టీలకూ పని చేయటం మొదలు పెట్టారు. బహుశా ఆయన తీరే అదేమో. బిహార్‌కు ఏం చేయాలనుకుంటున్నాడో చేయని వ్వండి. 2005 నుంచి ఏం జరిగిందో కనీస అవగాహనైనా పీకేకి ఉందా..? ఇవన్నీ పబ్లిసిటీ కోసం చేసే కామెంట్స్ మాత్రమే. ఇలాంటివి చేయటంలో ఆయనో ఎక్స్‌పర్ట్. ఆయన మనసులో ఇంకేదో ఉంది. భాజపాతో నేరుగా పని చేస్తారు. లేదంటే కోవర్ట్‌గా మారిపోతారు" అని నితీష్ అంతకు ముందు ఆరోపించారు.  




ప్రధాని అభ్యర్థిగా..? 


గత నెల భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ...పాతమిత్రుడు ఆర్‌జేడీతో కలిసి మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా నితీష్ కుమార్, డిప్యుటీ సీఎంగా తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే...సీఎం కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి
నితీష్...జాతీయ రాజకీయాలపైనా దృష్టి సారించారు. 2024లో ప్రధాని పదవికి నితీష్ కుమార్ పోటీ పడతారన్న వార్తలు చక్కర్లు కొడుతు న్నాయి. దీనిపై భాజపా కాస్త గట్టిగానే స్పందిస్తోంది. భాజపా నేత అమిత్ మాల్వియా సెటైర్లు వేశారు. "సీఎంగానే విఫలమైన వ్యక్తి ప్రధాని పదవి కోసం చూస్తుండటమేంటో. రాష్ట్రంలో ఆయన పార్టీ ఎప్పుడో అప్పుడో కుప్ప కూలిపోక తప్పదు" అని విమర్శించారు. ట్విటర్ వేదికగా కౌంటర్‌లు వేశారు. "పశ్చిమ బెంగాల్‌ను దాటి ప్రజల నమ్మకాన్ని పొందాలని ప్రయత్నించిన మమతా బెనర్జీ విఫలమయ్యారు. ఇప్పుడు నితీష్ కుమార్ కూడా అదే చేస్తున్నారు. సీఎంగానే విఫలమైన వ్యక్తి...సొంత పార్టీ మునిగిపోతుంటే...ప్రధాని పదవి కోసం ఆరాటపడుతున్నారు" అని ట్వీట్ చేశారు. ఇటీవలే నితీష్ కుమార్ భాజపా నేతృత్వంలోని NDA నుంచి బయటకు వచ్చేశారు.ఆర్‌జేడీతో జోడీ కట్టి కొత్త ప్రభుత్వం  ఏర్పాటు చేయటమే కాకుండా...ముఖ్యమంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. మహాఘట్‌బంధన్ ప్రభుత్వం ఏర్పడ్డాకే... నితీష్ 2024లో ప్రధాని పదవికి పోటీ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తల్ని నితీష్ కొట్టి పారేస్తున్నప్పటికీ...ఆ చర్చ మాత్రం జోరుగానే సాగుతోంది. 


Also Read: Viral Video: ఇదేం గోకుడు సామీ! తుక్కుతుక్కు చేసేశావ్ కదా గణేశా!


Also Read: Bengaluru Floods: విప్రో ఛైర్మన్ విల్లా మునిగిపోయిందట, బెంగళూరు వరదల ఎఫెక్ట్‌ అలా ఉంది మరి!