Bengaluru Floods:
రిచెస్ట్ గేటెడ్ కమ్యూనిటీకి వరదలు
బెంగళూరు ప్రజల్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదల కారణంగా...అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని వారి ఇళ్లన్నీ నీట మునిగాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్నారు అధికారులు. ఎప్పుడు వరదలు వచ్చినా...మిలియనీర్లకు, బిలియనీర్లకు ఏమీ కాదు. కష్టాలన్నీ మిగతా వర్గాలివే అనుకుంటారు. కానీ...ఈ సారి వరదలకు బెంగళూరులోని బిలియనీర్లనూ ఇబ్బంది పెడుతోంది. రిచెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అయిన Epsilonనూ వరద చుట్టుముట్టింది. ఎంతో మంది ధనికులు ఈ కమ్యూనిటీలోనే ఉంటారు. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ,
బ్రిటానియా సీఈవో వరుణ్ బెర్రీ, బిగ్‌బాస్కెట్ కో ఫౌండర్ అభినయ్ చౌదరి, బైజూస్ కో ఫౌండర్ బైజు రవీంద్రన్..ఇలా ఎందరో. వీళ్లందరూ ఇప్పుడు తమ ఇళ్లలోనే ఉండలేని పరిస్థతి వచ్చింది. ఇళ్లన్నీ జలమయమయ్యాయి. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఒక్కో విల్లా విలువ రూ.10 కోట్లు. ఇంత కాస్ట్‌లీ భవంతులూ వరద తాకిడికి తడిసి ముద్దైపోయాయి. సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. లగ్జరీ కార్లు నీటిలో మునిగిపోయాయి.
రెండ్రోజుల పాటు వర్షాలు
సిటీలోని ఐటీ హబ్ కూడా చాలా దారుణమైన స్థితిలో ఉంది. కంపెనీలన్నీ నీటిలో మునిగిపోయాయి. ఆ పరిసరాల్లోని రహదారులు జలమయ మయ్యాయి. వాహనాలు తిరిగే పరిస్థితే లేదు. ఈ వర్షాలతోనే ఇంత ఇబ్బందులు పడుతుంటే...IMD అంచనాలు ఇంకా కలవర పెడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు దక్షిణ కర్ణాటక సహా బెంగళూరులో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. సెప్టెంబర్ 5వ తేదీ రాత్రిపూట 131.6mm మేర రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.
Also Read: అమ్రావతిలో రాజాపేట్ పోలీస్ స్టేషన్ లో హంగామా చేసిన ఎంపీ నవ్ నీత్ కౌర్