Porsche Car Accident:
గుడ్‌గావ్‌లో బీభత్సం..
గుడ్‌గావ్‌లో స్పోర్ట్స్ కార్ పార్ష్ (Porsche Car Fire)కార్ బీభత్సం సృష్టించింది. మితిమీరి వేగంతో వచ్చి డివైడర్‌ని ఢీకొట్టింది. ఆ తరవాత అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టింది. వెంటనే కార్‌లో నుంచి మంటలు చెలరేగాయి. కోట్ల రూపాయల విలువ చేసే ఈ కార్ అక్కడికక్కడే కాలి బూడిదైపోయింది. గుడ్‌గావ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కార్‌లో ఇద్దరున్నారు. ఇద్దరూ మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే...కార్‌లో మంటలు రాకముందే ఎలాగోలా అందులో నుంచి బయట పడి ప్రాణాలు కాపాడుకున్నారు. కాస్త ఆలస్యమైనా కార్‌తో పాటు సజీవదహనం అయ్యే వారు. చండీగఢ్‌లో రిజిస్టర్ అయిన ఈ కార్ డ్రైవర్ మితిమీరిన వేగంతో కార్‌ని నడిపినట్టు పోలీసులు వెల్లడించారు. కంట్రోల్ తప్పి డివైడర్‌ని ఢీకొట్టిందని చెప్పారు. ఓ డివైడర్‌ని ఢీకొట్టి పూర్తిగా పక్క రోడ్డువైపు కార్ దూసుకెళ్లింది. అక్కడే ఓ చెట్టుని ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పింది. ప్రస్తుతం ఈ కార్ ఓనర్ పరారీలో ఉన్నాడు. వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే..ఆ తరవాతే ఈ కేసు మరో మలుపు తిరిగింది. పోలీసుల వద్దకు ఓ బిజినెస్‌మేన్ వచ్చాడు. ఆ కార్ తనదేనని, తన కొడుకే నడిపాడని చెప్పాడు. సడెన్‌గా కార్‌కి అడ్డంగా కుక్క వచ్చిందని, దాన్ని తప్పించబోయి డివైడర్‌ని ఢీకొట్టాడని తెలిపాడు. ప్రస్తుతానికి ఈ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.