Popular Front Of India: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సహా దాని అనుబంధ సంస్థలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఐదేళ్ల పాటు బ్యాన్ విధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పీఎఫ్‌ఐపై బ్యాన్‌ను ఎత్తివేయాలని దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. పీఎఫ్‌ఐ కార్యకర్త నసీర్ పాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు జస్టిస్ ఎం నాగ ప్రసన్న నేతృత్వంలోని సింగిల్ జడ్జి ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. అంతకుముందు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది జయకుమార్ ఎస్ పాటిల్ వాదిస్తూ కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ బ్యాన్‌ను ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పీఎఫ్ఐ దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతుందని, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, అనేక దుశ్చర్యలకు ఆ సంస్థలు పాల్పడ్డాయని ఆయన అన్నారు. దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు పిటిషన్‌ను తిరస్కరిస్తూ తన తీర్పును వెలువరించింది.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి), జమాత్ - ఉల్ - ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ), ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలియడంతో, ఇవన్నీ నిషేధిత సంస్థలని, పీఎఫ్ఐ స్థాపించిన వారిలో సిమి సభ్యులు ఉన్నారని కేంద్ర హోం శాఖ నిషేధాన్ని విధించింది.
Also Read: Arvind Kejriwal: 'సార్, మీరు మఫ్లర్ ఎందుకు వేసుకోలేదు'- కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన యువతి