Polls In Jammu Kashmir:


కీలక సమావేశం..


జమ్ముకశ్మీర్‌లోని  నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ సహా కాంగ్రెస్ ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘ అధికారులను కలిశారు. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా, ప్రమోద్ తివారి, నసీర్  హుస్సేన్ లాంటి కీలక నేతలు ఈసీ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశం ముగిసిన తరవాత నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ డిమాండ్‌లను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని ఈసీ చెప్పినట్టు వెల్లడించారు. 


"భారత్‌కు తలమానికమైన రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేయడం మన దురదృష్టం. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం కావాలన్నదే మా డిమాండ్. మొత్తం 13 పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదాను పునరుద్ధరించాలన్న డిమాండ్‌ను అందరూ అంగీకరించారు. అక్కడ పరిస్థితులంతా చక్కబడితే ఎన్నికలు నిర్వహించడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు..? ఈ విషయంలో మేం ఒకే మాటపై ఉన్నాం. వీలైనంత త్వరగా అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సిందే"


- ఫరూక్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి 










ఇదే సమయంలో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న డిమాండ్‌కు తామూ మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. 


"శ్రీనగర్‌కు వెళ్లేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. అక్కడి ప్రజల బాధను ప్రపంచానికి తెలియజేస్తాం. వారికి భరోసా కల్పిస్తాం"


- శరద్ పవార్, ఎన్‌సీపీ చీఫ్