PM Modi Assets: ప్రధాని నరేంద్ర మోదీ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి తన ఆస్తుల వివరాలను బహిర్గతం చేశారు. పీఎంఓ వెల్లడించిన వివరాల ప్రకారం.. గతేడాదితో పోలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు రూ.26 లక్షల మేర పెరిగాయి.
తన వద్ద ఉన్న భూమిని విరాళంగా ఇచ్చేయడంతో ప్రస్తుతం మోదీ ఆస్తుల విలువ రూ.2.23 కోట్లుగా ఉంది. ఏటా ఆస్తులు, అప్పుల వివరాలను నరేంద్ర మోదీ వెల్లడిస్తున్నారు.
బ్యాంకు డిపాజిట్లే
మోదీ ఆస్తుల్లో అత్యధికం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. మోదీకి ఎలాంటి స్థిరాస్థులూ లేవని పీఎంఓ తెలిపింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న కొంత నివాసయోగ్యమైన భూమిలో తన వాటాను దానంగా ఇచ్చినందున ఆయనకు స్థిరాస్తులేమీ లేవని తెలిపింది.
- బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో మోదీకి పెట్టుబడులు లేవు .
- మోదీకి సొంత వాహనం కూడా లేదు.
- మోదీకి నాలుగు బంగారం ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ రూ.1.73 లక్షలు.
- మోదీ చేతిలో రూ.35,250 నగదు, పోస్ట్ ఆఫీస్‌లో రూ.9,05,105 విలువ చేసే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఉన్నాయి
- వీటితో పాటు రూ.1,89,305 విలువ చేసే జీవిత బీమా పాలసీ ఉంది
2021, మార్చి 31 నాటికి మోదీ వద్ద ఉన్న రూ.1.1 కోట్ల విలువ చేసే ప్లాట్‌ను విరాళంగా ఇవ్వడంతో ప్రస్తుతం ఆయన వద్ద ఎలాంటి స్థిరాస్తులు లేవని పీఎంఓ పేర్కొంది.
కేంద్ర మంత్రుల ఆస్తి
ప్రధానితో పాటు కొంతమంది కేంద్రమంత్రులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించారు.
- రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రూ.2.54 కోట్లు విలువ చేసే చరాస్తులు, రూ.2.97 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.
- ధర్మేంద్ర ప్రధాన్ ఆస్తులు రూ.1.62 కోట్ల నుంచి రూ.1.83 కోట్లకు పెరిగాయి.
- జ్యోతిరాదిత్య సింధియా పేరిట రూ. 35.63 కోట్లు ఉండగా, రూ.58 లక్షల అప్పులు ఉన్నాయి.
- పురుషోత్తం రూపాలా ఆస్తుల విలువ రూ.7.29 కోట్లుగా ఉంది.
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రూ.1.43 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి.
Also Read: Bihar Political Crisis: 'జరిగిందేదో జరిగిపోయింది- అన్నీ మర్చిపోదాం, కలిసి పనిచేద్దాం'
Also Read: India Rankings In Various Indices: 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత వివిధ సూచికల్లో భారత్ స్థానం ఇది!