India Rankings In Various Indices: ఈ ఏడాది ఆగస్టు 15తో భారత్‌కు స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతాయి. ఈ 75 ఏళ్లలో దేశంలో టెక్నాలజీతో పాటు ఎన్నో రంగాల్లో పురోగతి వచ్చింది. అయితే చాలా రంగాల్లో భారత్ ముందున్నప్పటికీ ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.
ప్రతి సంవత్సరం అనేక అంతర్జాతీయ సంస్థలు వివిధ రంగాల్లో ప్రపంచ దేశాల ర్యాంకింగ్‌లను ప్రచురిస్తాయి. ఈ సూచికలన్నీ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ప్రపంచదేశాల పనితనాన్ని అంచనా వేస్తాయి. 2022 నాటికి విభిన్న సూచీలలో భారత స్థానం గురించి తెలుసుకుందాం.
1. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022: భారత్ ర్యాంక్ 150
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022ను రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF) విడుదల చేసింది. ఇది 180 దేశాల్లో జర్నలిజం స్థితిని అంచనా వేసింది. నకిలీ వార్తలు, వాటి ప్రచారాన్ని ప్రోత్సహించే ఆన్‌లైన్ సమాచారాలు, వాటి ప్రభావాలను ఈ సూచిక హైలైట్ చేసింది.
ఇండెక్స్‌లో భారత్ ర్యాంకింగ్ గతేడాది 142గా ఉండగా ఈసారి 150వ స్థానానికి పడిపోయింది. నేపాల్ మినహా భారత్ పొరుగు దేశాల ర్యాంకింగ్ కూడా పడిపోయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నేపాల్ 30 పాయింట్లు ఎగబాకి 76వ స్థానంలో నిలిచింది.
పాకిస్థాన్- 157, శ్రీలంక- 146, బంగ్లాదేశ్- 162, మయన్మార్- 176వ స్థానంలో నిలిచాయి.
టాప్-5
- నార్వే
- డెన్మార్క్
- స్వీడన్
- ఎస్టోనియా
- ఫిన్‌లాండ్
2. గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ Q4 2021
ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన 'గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ Q4 2021'లో భారత్ ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 51వ స్థానంలో నిలిచింది. 2020 క్యూ4లో భారతదేశం 56వ స్థానంలో నిలిచింది.
Q4 2021లో టర్కీ అత్యధిక వార్షిక ధరల వృద్ధి రేటును 59.6 శాతం సాధించింది. ఈ పరిశోధన నివేదికలో టాప్ దేశాలు ఇవే
టాప్-5
- టర్కీ (59.6 శాతం)
- న్యూజిలాండ్ (22.6 శాతం)
- చెక్ రిపబ్లిక్ (22.1 శాతం)
- స్లోవేకియా (22.1 శాతం)
- ఆస్ట్రేలియా (21.8 శాతం)
3. ఎస్‌డీజీ ఇండెక్స్ 2021: భారత్ ర్యాంక్ 120
సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2021లో భారత్ 120వ స్థానంలో నిలిచింది. ఈ ఇండెక్స్‌లో భారత్ 100కి 60.07 స్కోరు సాధించి 120వ ర్యాంక్ సాధించింది. అంతకుముందు ఏడాది భారత్ ర్యాంక్ 117.
టాప్-5
- ఫిన్లాండ్
- స్వీడన్
- డెన్మార్క్
- జర్మనీ
- బెల్జియం
4. అంతర్జాతీయ IP ఇండెక్స్ 2022: భారత్ ర్యాంక్ 43
భారత్ తన మొత్తం IP (ఇంటలెక్ట్యువల్ ప్రాపర్టీ) స్కోర్‌ను 38.4 శాతం నుంచి 38.6 శాతానికి మెరుగుపరుచుకుంది. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక 2022లో 55 దేశాలలో 43వ స్థానంలో ఉంది. ఈ సూచికను U.S. ఛాంబర్ ఆఫ్ కామర్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ విడుదల చేసింది.
టాప్- 5
- యునైటెడ్ స్టేట్స్
- యునైటెడ్ కింగ్‌డమ్
- జర్మనీ
- స్వీడన్
- ఫ్రాన్స్
5. ప్రజాస్వామ్య సూచిక: భారత్ ర్యాంక్ 46
ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకారం, 2021 డెమోక్రసీ ఇండెక్స్ గ్లోబల్ ర్యాంకింగ్‌లో భారత్ 46వ స్థానంలో ఉంది. అత్యధిక స్కోరు 9.75తో డెమోక్రసీ ఇండెక్స్ 2021లో నార్వే అగ్రస్థానంలో నిలిచింది. భారత్ 6.91 స్కోర్‌తో జాబితాలో 46వ ర్యాంక్‌కు చేరుకుంది.
టాప్ 5
- నార్వే
- న్యూజిలాండ్
- ఫిన్లాండ్
- స్వీడన్
- ఐస్లాండ్
Also Read: Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు
Also Read: Independence Day 20222 : భారత వాటర్ వారియర్స్ - వీరి స్ఫూర్తి లక్షల మంది దాహం తీరుస్తోంది !