PM Modi Twitter Followers: ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన రికార్డు సాధించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఎక్కువ మంది ఫాలో అవుతున్న గ్లోబల్ లీడర్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆయనకు ట్విటర్‌లో 100 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఇలా పదికోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న నేత ప్రపంచంలోనే లేరు. ఆ తరవాతి స్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు. ఆయనకు X లో 38.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే మోదీకి దరిదాపుల్లో కూడా లేరు. దుబాయ్‌ యువరాజు షేక్ మహమ్మద్ 11.2 మిలియన్ ఫాలోవర్స్‌తో బైడెన్ తరవాతి స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు. Xలో 100 మిలియన్ ఫాలోవర్స్ రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలతో తన అభిప్రాయాలు పంచుకోడానికి ఇదో గొప్ప వేదిక అని వెల్లడించారు. భవిష్యత్‌లోనూ ఇదే స్థాయిలో తనను ఆదరిస్తారని ఆకాంక్షించారు. 






భారత్‌లోనూ మిగతా లీడర్స్‌తో పోల్చుకుంటే ప్రధాని మోదీ చాలా ముందంజలో ఉన్నారు. రాహుల్ గాంధీకి ట్విటర్‌లో 26.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి 27.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తరవాత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కి 19.9 మిలియన్‌ ఫాలోవర్స్ ఉండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ట్విటర్‌లో 7.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.


మోదీ రికార్డ్ పై అమిత్ షా స్పందించారు. ప్రధానికి కంగ్రాట్స్ చెప్పారు. ప్రపంచస్థాయిలో ఎవరూ ఢీకొట్టలేని స్థాయికి మోదీ ఎదిగారంటూ ప్రశంసలు కురిపించారు. భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగానూ ఆయనకు ఆదరణ ఉందని, అందుకే ఈ రికార్డు సాధ్యమైందని వెల్లడించారు. ఈ మేరకు X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అంతర్జాతీయ వేదికలపైనా ప్రధాని మోదీకి ఆదరణ లభిస్తోంది. ఇటీవల ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారీ అక్కడ అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. ఢిల్లీ వేదికగా G20 సమావేేశాలు జరిగిప్పుడూ మోదీ ఇచ్చిన ఆతిథ్యానికి ప్రపంచ దేశాధినేతలు ఫిదా అయ్యారు. పలు దేశాల అధినేతలతో మోదీకి మంచి సాన్నిహిత్యం ఉంది. 






Also Read: Anant Ambani Wedding: షారుక్ రణ్‌వీర్‌కి అనంత్ అంబానీ కాస్ట్‌లీ గిఫ్ట్‌, రూ.2 కోట్ల వాచ్‌తో సర్‌ప్రైజ్ - మరికొందరికి కూడా