IAC Vikrant:
సెప్టెంబర్ 2వ తేదీన ముహూర్తం..
హిందూమహా సముద్రంలో (IOR)లో భారత్ మరింత శక్తిమంతం కానుంది. మొట్టమొదటి సారి దేశీయంగా తయారు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ (IAC)భారత నౌకాదళానికి అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 2వ తేదీన ప్రధాని మోదీ అధికారికంగా దీన్ని ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఇండియన్ నేవీకి ఇప్పటికే ఈ క్యారియర్ డెలివరీ అయింది. కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) జులైలో ఈ క్యారియర్‌ను నేవీకి అందించింది. తయారీకి రూ.20 వేల కోట్లు ఖర్చైంది. 2009లో IAC విక్రాంత్ తయారీ మొదలైంది. కొచ్చిన్
షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ప్రత్యేకంగా ఓ స్థలం కేటాయించి దీన్ని డిజైన్ చేశారు. ఇలాంటి వార్‌షిప్స్‌ను తయారు చేసుకునే సామర్థ్యం ఉన్న దేశాల్లో భారత్ కూడా సగర్వంగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా 5, 6 దేశాల వద్ద మాత్రమే ఇలాంటి శక్తిమంతమైన క్యారియర్‌లున్నాయి. గత నెలలో చివరి విడత "సీ ట్రయల్స్" నిర్వహించారు. భారత్‌లో తొలి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌గా పేరొందిన INS Vikrantకి గుర్తుగా...ఇప్పుడు తయారు చేసిన క్యారియర్‌కు ఆ పేరు (IAC Vikrant)పెట్టారు. "సెప్టెంబర్ 2వ తేదీన కొచ్చిన్ షిప్‌యార్ట్ లిమిటెడ్‌లో ఈ ఈవెంట్ జరగనుంది.
INS విక్రాంత్ రిటైర్డ్ స్టాఫ్, రక్షణ శాఖకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు" అని ఉన్నతాధికారులు వెల్లడించారు.
IAC విక్రాంత్ ఫీచర్స్ ఇవే..
262 మీటర్ల పొడవైన ఈ క్యారియర్ 45 వేల టన్నుల బరువుంటుంది. INS విక్రాంత్ కన్నా చాలా అడ్వాన్స్‌డ్ క్యారియర్ ఇది. ఇందులో 88 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగు గ్యాస్ టర్బైన్లుంటాయి. మిగ్-29 K ఫైటర్ జెట్స్, కమోవ్ -31 (Kamov-31), MH-60R మల్టీ రోల్ హెలికాప్టర్లను ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి ఆపరేట్ చేయనున్నారు. IAC విక్రాంత్‌లో మొత్తం 2,300 కంపార్ట్‌మెంట్‌లుంటాయి. 1700 మంది సిబ్బంది పని చేస్తారు. వీటితో పాటు మహిళా ఆఫీసర్ల కోసం స్పెషలైజ్డ్ క్యాబిన్స్ ఉంటాయి. ఈ క్యారియర్‌లోని ఎక్విప్‌మెంట్, మెషినరీ అంతా దేశీయంగా తయారైనవే. దేశంలోనే భారీ ఇండస్ట్రియల్ హౌజ్‌లు వీటిని తయారు చేశాయి. మొత్తం 76% మేర దేశీయంగా తయారైన ఈ క్యారియర్.. "ఆత్మనిర్భర భారత్"కు సాక్ష్యమని నౌకాదళం స్పష్టం చేసింది. రెండు ఫుట్‌బాల్ గ్రౌండ్స్ అంత వెడల్పున్న ఈ క్యారియర్ మొత్తం 8 కిలోమీటర్ల కారిడార్‌తో ఉంటుంది.
Also Read: తారక్- అమిత్ షా భేటీలో అసలు జరిగింది ఏంటి...? బీజేపీకి అంత పెద్ద ప్లాన్ ఉందా..?