PM Modi Uttarakhand Visit: ఉత్తరాఖండ్‌లో రూ.17,500 కోట్లతో 23 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన

ABP Desam   |  Murali Krishna   |  30 Dec 2021 05:54 PM (IST)

ఉత్తరాఖండ్‌లో రూ.17,500 కోట్ల విలువైన 23 అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

ఉత్తరాఖండ్‌లో అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన

2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హల్ద్వానీలో జరిగిన బహిరంగసభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.17,500 కోట్ల విలువైన 23 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆరోగ్య, నివాస, రహదారులు, పరిశ్రమల మోలిక సదుపాయాల కోసం వీటిని వినియోగించనున్నారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయింది. ఇన్నేళ్లలో రాష్ట్రాన్ని దోచుకున్న ఎంతో మంది నాయకులను, ప్రభుత్వాలను మీరు చూశారు. ఉత్తరాఖండ్‌ను దోచుకోండి కానీ నా ప్రభుత్వాన్ని కాపాడండి అన్న నేతలను మీరు చూసుంటారు. వీరంతా రెండు చేతులతో ఉత్తరాఖండ్‌ను కొల్లగొట్టారు. ప్రస్తుతం వీళ్ల నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోవడంతో అసత్యాలను వ్యాప్తి చేసే పనిలో పడ్డారు. ఉత్తరాఖండ్ అభివృద్ధి చెందడం వారికి ఇష్టం లేదు.  ఈ అభివృద్ధి ప్రాజెక్టులు హల్ద్వానీ ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ, మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. తాగునీరు, రోడ్లు, పార్కింగ్, వీధి దీపాలు సహా హల్ద్వానీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.2,000 కోట్లతో ఓ పథకాన్ని తీసుకువస్తున్నాం.              -       ప్రధాని నరేంద్ర మోదీ

ఈ క్రమంలోనే అభివృద్ధిని తరిమేయడానికి కొందరు పని చేశారని విపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు మోదీ. రాష్ట్ర ప్రగతి కోసం వారెప్పుడూ పని చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధే అజెండాగా 'సబ్​కా సాత్​, సబ్​కా వికాస్'​ నినాదంతో ముందుకెళ్తుందన్నారు.

Also Read: EC Press Conference Highlights: యూపీ ఎన్నికలు యథాతథం.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన

Also Read: Covid 19 Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా వ్యాప్తి.. 1000కి చేరువైన ఒమిక్రాన్ కేసులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

Published at: 30 Dec 2021 05:52 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.