PM Modi US Visit:
గిఫ్ట్‌గా ఇచ్చిన మోదీ..
ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి హెడ్‌క్వార్టర్స్‌లో అంతర్జాతీయ యోగ దినోత్సవంలో పాల్గొన్న ఆయన ఆ తరవాత ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్‌ని కలిశారు. వారిద్దరూ మోదీని సాదరంగా స్వాగతించారు. ఆ సమయంలోనే బైడెన్ దంపతులు ప్రధాని మోదీకి పాత కెమెరాను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇటు ప్రధాని మోదీ మాత్రం జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్‌కి గ్రీన్ డైమండ్ (Green Diamond) గిఫ్ట్‌గా ఇచ్చారు. మరి మోదీ ఆ వజ్రాన్ని ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చారు. అందులో అంత స్పెషల్ ఏముంది..? నార్మల్ డైమండ్స్‌కి దీనికి తేడాలేంటి..?
ఎవర్ గ్రీన్ డైమండ్..
ప్రధాని మోదీ జిల్ బైడెన్‌కి ఇచ్చిన ఆ ఆకుపచ్చ డైమండ్ బరువు 7.5 క్యారట్లు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్పెషల్ డైమండ్‌ని తయారు చేశారు. సాధారణంగా ఓ వజ్రాన్ని వెలికి తీసినప్పుడు అందులో ప్రతి క్యారట్‌కి కనీసం 125 పౌండ్ల కార్బన్ ఉంటుంది. కానీ మోదీ జిల్ బైడెన్‌కి ఇచ్చిన గ్రీన్ డైమండ్‌లో మాత్రం క్యారట్‌కి 0.028 గ్రాముల కార్బన్ మాత్రమే ఉంటుంది. మరో హైలైట్ ఏంటంటే...పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా దీన్ని తయారు చేశారు. సోలార్, వైండ్ ఎనర్జీతో దీన్ని మన ఇండియాలోనే ఓ ల్యాబ్‌లో తీర్చి దిద్దారు. అంటే ఇది "మేడిన్ ఇండియా" డైమండ్. మరో స్పెషాల్టీ ఏంటంటే...దీనిపై 4C Hallmark కూడా ఉంది. Cut, Colour, Carat and Clarity పరంగా ఈ డైమండ్ "ది బెస్ట్" అని సర్టిఫికేట్ వచ్చేసిందన్నమాట.
డైమండ్ బాక్స్ కూడా స్పెషలే...
ఇక ఈ డైమండ్ పెట్టిన బాక్స్‌కి కూడా ఓ ప్రత్యేకత ఉంది. కశ్మీర్‌లోని కళాకారులు దీన్ని తయారు చేశారు. దీన్ని Papier mâché బాక్స్‌గా పిలుస్తారు. పేపర్‌ని, ఓ రకమైన పేస్ట్‌ని కలిపి ఈ బాక్సులు తయారు చేస్తారు. కశ్మీర్‌కి మాత్రమే సొంతమైన కళ ఇది. ఇందులో చాలా డిజైన్స్ కూడా తయారు చేస్తారు కళాకారులు. ఎన్నో ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటాయివి. దీన్ని kar-e-kalamdaniగా పిలుస్తారు. ఓ రకంగా మన దేశ సంస్కృతిని ప్రతిబింబించే బాక్స్ ఇది.
గ్రీన్ డైమండ్ అంటే..?
సాధారణ వజ్రంతో పోల్చి చూస్తే గ్రీన్ డైమండ్ చాలా స్పెషల్. అటామిక్ రేడియేషన్‌లో చాలా ఏళ్ల పాటు ఉంచితే కానీ ఈ డైమండ్ ఇంత అందంగా తయారవదు. అంతే కాదు. ఇది చాలా ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ గ్రీన్ డైమండ్‌లో చాలా రకాలుంటాయి. లైట్ గ్రీన్, ఫ్యాన్సీ గ్రీన్, ఫ్యాన్సీ డీప్...ఈ మోడల్స్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. కలర్డ్ డైమండ్స్ కన్నా వీటి విలువ ఎక్కువ. గ్రీన్ డైమండ్‌తో పాటు పింక్ డైమండ్స్‌కీ మార్కెట్‌లో విలువ ఎక్కువగా ఉంటుంది.
Also Read: Karnataka High Court: పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని ఓ వివాహిత పిటిషన్, కోర్టు సంచలన వ్యాఖ్యలు