PM Modi Meeting on Covid: దేశంలో కొవిడ్ పరిస్థితిపై (Covid-19 Situation) ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో గురువారం ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. చైనాలో కరోనావైరస్ వ్యాప్తిపై పెరుగుతున్న ఆందోళనల మధ్య పరిస్థితిని అంచనా వేయడానికి ఈ సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.


ప్రస్తుతం చైనాను కుదిపేస్తోన్న ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్ BF.7కు చెందిన నాలుగు కేసులు భారత్‌లో బయటపడ్డాయి. గుజరాత్‌లో రెండు, ఒడిశాలో రెండు కేసులు వెలుగుచూశాయి. గుజరాత్‌లో రోగులిద్దరూ కోలుకున్నారని అధికారులు తెలిపారు.


ఆరోగ్య శాఖ


అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని నివేదికలు వస్తున్న నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితులపై అధికారులు, నిపుణులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుక్ మాండవీయ బుధవారం  సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి ఆగిపోలేదని తెలుపుతూ సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారి చేసారు.



పలు దేశాల్లో కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో అధికారులు, నిపుణులతో సమీక్ష సమావేశం నిర్వహించాం. కరోనా వ్యాప్తి అప్పుడే అయిపోలేదు. అన్ని శాఖల ఆధికారులు అప్రమత్తంగా ఉండి ఎపట్టికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించాం. ఎలాంటి పరిస్థితిని అయిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలి.                                        "
-మన్‌సుక్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి 


సూచనలు


వైరస్ వ్యాపించకుండా రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. కోమోర్బిడిటిస్‌తో బాధపడే  పెద్దవాళ్ళ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రికాషన్ డోసులు తీసుకోవాలని తెలిపింది. విదేశీ ప్రయాణాల విషయంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది.


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయ నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశం అనంతరం  నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడారు.





ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ ఈ మంగళవారం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అలర్ట్‌ చేస్తూ లేఖలు రాశారు. 2019 లో ప్రారంభమై దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని గడగడలాడించి, వారి జీవితాలను అతలాకుతలం చేసింది కరోనా. వైరస్ సంక్షోభం ధాటికి అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు పతనమయ్యాయి. ప్రపంచ దేశాల ప్రజలు వరుస లాక్ డౌన్‌లు, కొవిడ్ నిబంధనల మూలంగా ఇళ్లకే పరిమితమై అనేక ఆర్ధిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇన్ని అవస్థలకు గురి చేసిన కరోనా వైరస్ మళ్ళీ తన ప్రతాపం చూపిస్తోంది.


Also Read: Amruta Fadnavis: భారత్‌కు ఇద్దరు జాతిపితలున్నారు, అప్పట్లో గాంధీ ఇప్పుడు మోడీ - అమృత ఫడణవీస్