Modi Astronaut:


నాసా ప్లాన్..


అంతరిక్షంలోకి దూసుకుపోయే అవకాశమొస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు. రాజకీయ నాయకులైనా అందుకు అతీతమేమీ కాదు. అందుకే నాసా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కి చెందిన ఓ పొలిటీషియన్‌ని International Space Station కి తీసుకెళ్లాలని భావిస్తోంది. అందుకోసం అవసరమైన ట్రైనింగ్‌ కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఇది సాధ్యపడుతుందని నాసా చీఫ్, సెనేటర్ బిల్ నెల్సన్ (Bill Nelson) వెల్లడించారు. రెండు వారాల పాటు కొనసాగనున్న ఈ మిషన్‌కి ఇండియన్ పొలిటీషియన్‌ని పంపనుంది నాసా. అయితే..ఇదే విషయమై బిల్ నెల్సన్ ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన భారత్ పర్యటనలో ఉన్నారు. "ప్రధాని నరేంద్ర మోదీని స్పేస్‌లోకి తీసుకెళ్తారా" అని ప్రశ్నించగా (PM Modi Astronaut) ఆసక్తికరమైన బదులిచ్చారు. 


"ఓ రాజకీయ నాయకుడినైన నేను అంతరిక్షంలోకి వెళ్లొచ్చాను. ఓ పొలిటీషియన్‌కి స్పేస్‌లోకి వెళ్లి రావడం అనేది చాలా అరుదైన, విలువైన అనుభూతి. మరెంతో మంది రాజకీయ నాయకులు వెళ్లాల్సి ఉంది. స్పేస్‌లోకి వెళ్లడంలో ఎవరికీ ఎలాంటి హద్దులు ఉండవు. భూమి నివసించే ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం ఉంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్పేస్‌లోకి వెళ్లడం అంటే చాలా ఇష్టం"


- బిల్ నెల్సన్,నాసా చీఫ్


మూన్ మిషన్స్‌పై ఫోకస్..


Artemis Programme లో భారత్‌ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు బిల్ నెల్సన్. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా Moon Missions చేపట్టనుంది నాసా. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నాసా విడతలో తొలిసారి ఓ మహిళను చంద్రుడిపైకి పంపేందుకు కసరత్తు చేస్తోంది. భారత్ కూడా ఇలాంటి మిషన్స్‌లో కీలకంగా వ్యవహరించాలని కోరారు నెల్సన్. 


"మూన్ మిషన్స్ విషయంలో అంతర్జాతీయ భాగస్వామ్యం చాలా కీలకం. ఈ విషయంలో భారత్ ముఖ్యపాత్ర పోషిస్తుందన్న నమ్మకముంది. ఎన్నో అవకాశాలున్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలి. భవిష్యత్‌లో మేం చేపట్టబోయే మూన్ మిషన్స్‌కి భారత్ భాగస్వామ్యం అవసరం"


- బిల్ నెల్సన్,నాసా చీఫ్


50 ఏళ్ల తరవాత..


మూన్‌ మిషన్‌పై దృష్టి సారించిన నాసా ఆ తరవాత మార్స్‌పై వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అమెరికాతో కలిసొచ్చేందుకు పలు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. 1969లో నాసా తొలిసారి నీల్ ఆర్మ్‌స్ట్రంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్‌ని చంద్రుడిపైకి పంపింది. 50 ఏళ్ల తరవాత ఇప్పుడు మరోసారి ఓ ఆస్ట్రోనాట్‌ని పంపనుంది.