Modi Brother Dharna : సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కడం సహజం. అయితే ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లో ఉన్నవారి దగ్గరి బంధువులు.. వారి పార్టీ సభ్యులు ఇలాంటి ధర్నాలు చేయరు. కానీ ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోరు. సమస్యల కోం ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. తాజాగా ఆయన ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా చేశారు., అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘానికి ప్రహ్లాద్ మోదీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. తమ సంఘం డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ధర్నా చేపట్టారు.
ఎంత 'గో ఫస్ట్' అయితే మాత్రం విమానం కంటే ముందే వెళ్లిపోతావా?
ధరలు పెరిగిపోయి... ఖర్చులు పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్ దుకాణాలు నడపడం కష్టంగా మారిందని ఆయన ఆంటున్నారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలు, పంచదారపై కేంద్ర ప్రభుత్వం తమకిచ్చే కమిషన్‌లో కేజీకి 20 పైసలు మాత్రమే పెంచడం క్రూరమైన హాస్యమని ప్రహ్లాద్ మోదీ విమర్శించారు. రేషన్ డీలర్లను ఆర్ధిక కష్టాలనుంచి గట్టెక్కించడానికి కేంద్రం సాయం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం తమ డీలర్ల సంఘం నాయకులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు.
'ఆపరేషన్ గుజరాత్' పనిలో కేజ్రీవాల్ బిజీబిజీ- అప్పుడే అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా
బుధవారం తాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలుస్తామన్నారు. పశ్చిమబెంగాల్ తరహాలో దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్న వారికి రేషన్ షాపుల్లో సబ్సిడీ ధరల్లో బియ్యం, గోధుమలు, పంచదార, అమ్మేందుకు అనుమతినివ్వాలని అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. అంతేకాదు గ్యాస్ సిలెండర్లు, పప్పు దినుసులు, వంటనూనెలు కూడా రేషన్ షాపుల ద్వారా అమ్మేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్ల సంఘం నేతలు కోరుతున్నారు.
సోదరుడికి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఖరారయిందో లేదో స్పష్టత లేదు. అయితే ప్రహ్లాద్ మోదీ రేషన్ డీలర్ల సమస్యలపై దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఉంటారు. ప్రధాని సోదరుడు అయినా... విపరీతంగా ప్రచారం జరుగుతుందని తెలిసినా ఆయన .. రేషన్ డీలర్ల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారు.