PM Modi rejects Trump invitation to visit US: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన బహిరంగసభలో ఈ విషయం చెప్పారు. కెనడాలో జరిగిన G7 సమ్మిట్‌లో పాల్గొన్న తర్వాత, యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి మోదీకి ఫోన్ చేశారు. కెనడా నుండి తిరిగి వెళ్ళే మార్గంలో వాషింగ్టన్ డీసీలో చర్చల కోసం రావాలని ఆహ్వానించారు ఈ ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు, తనకు ఒడిశాలోని పురీలో జగన్నాథ దేవాలయాన్ని సందర్శించాలనే ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉందని, అది తనకు అత్యంత ముఖ్యమని చెప్పానన్నారు. భు
ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మోదీ భువనేశ్వర్‌కు వచ్చారు. మోదీ 105 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు . బౌద్ జిల్లాకు మొదటి ప్యాసింజర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. మోదీ ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించడం వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని అనుకోవచ్చు. ఒడిశా ప్రజలతో సంబంధాన్ని బలోపేతం చేయడానికి, మోదీ తన పర్యటనను జగన్నాథుడి భక్తితో ముడిపెట్టారని భావిస్తున్నారు. ఇది స్థానిక ప్రజల భావోద్వేగాలను ఆకర్షించే వ్యూహంగా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అదే రోజు ట్రంప్ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అసిమ్ మునీర్‌ను వైట్ హౌస్‌లో లంచ్ కోసం ఆహ్వానించారు. మోదీ ఈ ఆహ్వానాన్ని అంగీకరించి ఉంటే, అదే రోజు ట్రంప్ మోదీ , మునీర్ ఇద్దరినీ కలిసే అసౌకర్య పరిస్థితి ఏర్పడేది.
ఆపరేషన్ సింధూర్ ను తానే ఆపానని.. మధ్యవర్తిత్వం చేసి ఒక “న్యూక్లియర్ యుద్ధాన్ని” నివారించినట్లు పదేపదే పేర్కొన్నారు. మోదీ, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ద్వారా ఈ వాదనలను స్పష్టంగా తోసిపుచ్చారు, భారతదేశం కాశ్మీర్ విషయంలో ఎప్పుడూ మూడవ పక్ష మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని స్పష్టం చేశారు. పదే పదే మోదీ ఇలాంటి ప్రకటనలు చేశారు. చివరికి మోదీ ఫోన్ లో అసంతృప్తి వ్యక్తం చేయడంతో తన ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. ట్రంప్ ఆహ్వానాన్ని మోదీ తిరస్కరించినప్పటికీ, భారతదేశంలో జరగనున్న తదుపరి క్వాడ్ సమ్మిట్ కోసం ట్రంప్‌ను భారతదేశానికి ఆహ్వానించారు. ట్రంప్ ఈ ఆహ్వానాన్ని ఉత్సాహంగా అంగీకరించారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. క్వాడ్‌లో జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్, భారత్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం ప్రాముఖ్యతను బలపరుస్తుంది.
ట్రంప్ ఆహ్వానాన్ని మోదీ తిరస్కరించినప్పటికీ, భారత-యుఎస్ సంబంధాలు బలంగా ఉన్నాయి. ఫిబ్రవరి 13, 2025న వాషింగ్టన్‌లో జరిగిన సమావేశంలో, మోదీ , ట్రంప్ రక్షణ, వాణిజ్యం, మరియు సాంకేతిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు, వీటిలో F-35 జెట్‌ల విక్రయం, ఎనర్జీ ట్రేడ్, మరియు క్వాడ్ సమ్మిట్‌లో సహకారం ఉన్నాయి. మోదీ తిరస్కరణ భారతదేశం స్థిరమైన విదేశాంగ విధానాన్ని బలపరిచిందన్న అభిప్రాయం వినిపిస్తోంది