PM Modi in Austria: ఆస్ట్రియా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం (Modi Austria Visit) లభించింది. 41 ఏళ్ల క్రితం ఇందిరా గాంధీ ఆస్ట్రియాలో పర్యటించారు. చివరిసారి 1983లో ఇందిరా గాంధీ ఆస్ట్రియాకి వెళ్లారు. ఆ తరవాత అక్కడికి వెళ్లిన భారత ప్రధాని..మోదీ మాత్రమే. ఈ సందర్భంగా ఆయనకు మర్చిపోలేని ఆహ్వానాన్ని అందించారు అక్కడి ఆర్టిస్ట్‌లు. భారత దేశ జాతీయ గీతమైన వందేమాతరాన్ని ఆలపించారు. వియన్నాలోని Ritz-Carlton హోటల్‌లో దిగిన ఆయనను ఇలా ఆహ్వానించారు. అక్కడే భారత సంతతికి చెందిన కొందరు మోదీని కలిసి మాట్లాడారు. 






అంతకు ముందు ప్రధాని మోదీ ఓ పోస్ట్ చేశారు. వియన్నాకు చేరుకున్నానని, ఈ పర్యటన తనకెంతో ప్రత్యేకమని వెల్లడించారు. పర్యటనలో భాగంగా కీలక చర్చలు జరిపేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. అటు ఆస్ట్రియా ఛాన్స్‌లర్ కార్ల్ నెహమ్మర్ (Karl Nehammer) మోదీని ప్రైవేట్ డిన్నర్‌కి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తరవాత మోదీతో సెల్ఫీ కూడా తీసుకున్నారు. వియన్నాకి ఇలా వెల్‌కమ్ చెప్పారు.


"భారత ప్రధాని మోదీకి వియన్నాకి స్వాగతం. మీకు ఆతిథ్యం ఇవ్వడం మాకెంతో గౌరవం. ఆస్ట్రియా, భారత్‌ మధ్య మంచి మైత్రి ఉంది. భవిష్యత్‌లోనూ ఇది ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. రాజకీయాలతో పాటు ఆర్థికపరమైన అంశాలూ చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం"


- కార్ల్ నెహమ్మర్, ఆస్ట్రియా ఛాన్స్‌లర్






మోదీ కీలక ట్వీట్..


కార్ల్ నెహమ్మర్‌తో భేటీ తరవాత ప్రధాని మోదీ కీలక పోస్ట్ పెట్టారు. దశాబ్దాల తరవాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. 75 ఏళ్ల భారత్-ఆస్ట్రియా మైత్రిని మరింత ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు.






Also Read: Supreme Court: మగాళ్లూ బుద్ధి తెచ్చుకోండి, ముస్లిం మహిళల భరణం విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు