Guppedanta Manasu  Serial Today Episode:  వసుధార, రాధమ్మ దగ్గరకు వెళ్లి మీరు మీ మనవడి విషయంలో ఏదైనా దాస్తున్నారా? అని అడగ్గానే రాధమ్మ షాక్‌ అవుతుంది. దీంతో గట్టిగా చెప్పండి బామ్మ అని వసుధార అడగ్గానే లేదమ్మా వాడు నా మనవడేనమ్మా వాడి విషయంలో దాయడానికి ఏముంటుంది అంటుంది. ఏం లేకపోతే మీరెందుకంత కంగారుపడుతున్నారు అని వసుధార ప్రశ్నించడంతో రాధమ్మ షాకింగ్‌ గా చూస్తుండి పోతుంది. తను పుట్టిన దగ్గర నుంచి మీ దగ్గరే ఉన్నాడా? తను ఎంత వరకు చదువుకున్నాడు. అంటూ ఆరా తీస్తుంది వసుధార. నువ్వు పొరబడుతున్నావమ్మా వాడు నా మనవడు రంగానే... నాకు వాడు వాడికి నేను అంటూ చెప్పగానే నీ మనవడిగా నటిస్తున్న రంగానే నా రిషి సార్‌ అని నా మనసుకు అనిపిస్తుంది.


రాధమ్మ: సరేనమ్మా నాదో సందేహం..


వసుధార: ఏంటి బామ్మా చెప్పు..


రాధమ్మ: ఏం లేదమ్మా నువ్విక్కడ నా మనవణ్ని పట్టుకుని నీ రిషి సారు, నీ భర్త అంటున్నావు కదా? రేపు నువ్వు మీ ఇంటికి వెళ్తున్నావు కదా ఒకవేళ అక్కడ నీ భర్త రిషి సార్‌ ఉంటే ఏంటమ్మా నీ పరిస్థితి. అప్పుడు కూడా నా మనవణ్నే రిషి సార్‌ అంటావా?


వసుధార: రిషి సార్‌ ఇక్కడుంటే అక్కడెందుకుంటారు బామ్మ. ఏంటి బామ్మ నేను అంటుంది నిజమేనా?


 అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే చాటు నుంచి రంగ వింటాడు. తర్వాత వసుధార వెళ్లి పడుకుంటుంది. మరుసటి రోజు రంగ, వసుధార వెళ్లబోతుంటే సరోజ వచ్చి రాత్రి నీకో గిఫ్ట్‌ ఇస్తానన్నాను కదా? అంటూ నేను మీతో వస్తానని.. తనను అక్కడ దిగబెట్టి మళ్లీ ఇద్దరం కలిసి వద్దామని అడుగుతుంది. దీంతో రంగ వద్దని వారిస్తాడు. తర్వాత సరోజ, వసుధారకు బొట్టు పెట్టి గిఫ్ట్‌ ఇస్తుంది. అది నాకు నచ్చని కలర్‌ శారీ కానీ చాలా ఖరీదైంది.. దాన్ని ఎప్పటి నుంచో పడేదామనుకుంటున్నా ఇప్పుడు నీకు వేశాను అంటుంది. నువ్వైతే ధైర్యంగా ఉండు అంటూ వసుధార చెప్తుంది. మరోవైపు అనుపమ వాళ్ల పెద్దమ్మకు ఫోన్‌ చేసి మను తండ్రి మహేంద్ర అనే నిజం అందరికీ చెప్తానని ఎవరో తనను బెదిరిస్తున్నారని చెప్తుంది. మరోవైపు సిటీకి వచ్చిన వసుధార, రంగా లోకల్ బస్టాప్‌లో ఉంటారు.


వసుధార: ఏంటి సర్‌ ఏమైనా పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయా?


రంగ: ఇక్కడ నాకేం జ్ఞాపకాలు ఉంటాయి మేడం గారు. ఇక్కణ్నుంచి మీ ఇంటికి ఎలా వెళ్లాలి.


వసుధార: ఎలా అయినా వెళ్లొచ్చు సార్‌ కానీ మనం ఆటోలో వెళ్దాం.


 అని ఇద్దరూ కలిసి ఆటోలో వెళ్తుంటారు. వసుధార తాను కాలేజీ వదిలి వెళ్లినప్పుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది.


రంగ: ఏంటి మేడం గారు అలా చూస్తున్నారు. మీ ఇంటికి వెళ్తున్నామని సంతోషంగా ఉందా?


వసుధార: అవును సార్‌ నా రిషి సర్‌ ను తీసుకెళ్తున్నానని ఆనందపడుతున్నాను.


రంగ: అసలు వినదుగా తన పంతాలో తానే మాట్లాడుతుంది తప్పా ఎదుటివాళ్లు చెప్పింది అర్థం చేసుకోదు. ( అని మనసులో అనుకుంటాడు.)


వసుధార: సర్‌ ఏం ఆలోచిస్తున్నారు.


రంగ: ఏం లేదు మేడం గారు ఇంకెంత టైం పడుతుంది మీ ఇంటికి వెళ్లడానికి..


అని అడగ్గానే దగ్గరే వచ్చేశామని పక్కన ఆటో ఆపి దిగుతారు. ఇక్కణ్నుంచి నడుచుకుంటూ వెళ్దామని వసుధార, రంగ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తుంటారు. వసుధారకు పాత జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. రంగా నీడతో వసుధార నడుస్తుంది. దీంతో రంగా ఎంటి మేడం గారు మీరెలా నడుస్తున్నారు అని అడగ్గానే వసుధార నవ్వుతూ మీ అడుగులో అడుగేస్తున్నాను అని పదండి అంటూ ముందుకు నడుస్తుంది.  కొద్ది దూరంలో మహేంద్ర ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. రంగ, వసుధారలను చూడకుండానే వెళ్లిపోతాడు. కొద్ది దూరం వెళ్లాక రంగ ఎటు వైపు వెళ్లాలి అని అడుగుతాడు. వసుధార అటు వైపు అని చూపిస్తుంది. దీంతో అటు వైపు కాదనుకుంటా? ఇటు వైపు ఉండొచ్చు అంటాడు దీంతో వసుధార షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 ALSO READ: వెన్నుచూపి పారిపోయిన కర్ణుడు పరాక్రమవంతుడా? సినిమాలు చూసి మోసపోకండి..ఇదిగో నిజం!