Is Cartoon Network really shutting Down?: కార్టూన్ నెట్ వర్క్. భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన యానిమేషన్ టెలివిజన్లలో ముఖ్యమైనది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో #RIPCartoonNetwork అనే అంశం ట్రెండింగ్ అవుతోంది. గత కొద్ది సంవత్సరాలుగా యానిమేషన్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరిస్తూ ఓ యానిమేటర్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోకు #RIPCartoonNetwork అనే క్యాప్షన్ పెట్టాడు. ఈ కార్టూన్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో క్యాప్షన్ చూసి చాలా మంది కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ మూత పడుతుందేమోనని భావించారు. సోషల్ మీడియా వేదికగా కార్టూన్ నెట్ వర్క్ ఛానెల్ క్లోజ్ అవుతుందంటూ పోస్టులు పెడుతున్నారు.
కార్టూన్ నెట్ వర్క్ ఛానెల్ నిజంగానే మూతపడుతుందా?
గత కొన్నేళ్లుగా చిన్నారుతో సహా యానిమేషన్ లవర్స్ ను ఎంతగానో అలరిస్తున్న కార్టూన్ నెట్ వర్క్ ఛానెల్ మూతపడుతుందనే ప్రచారాన్ని చూసి చాలా బాధపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చానెల్ మూసివేయకూడదంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. అయితే. ఈ ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. కార్టూన్ నెట్ వర్క్ ఛానెల్ మూసివేయడం లేదని, యానిమేషన్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చిండానికి #RIPCartoonNetwork వీడియో రూపొందించినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో కార్టూన్ నెట్ వర్క్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఇంతకీ #RIPCartoonNetwork వీడియోలో ఏం ఉందంటే?
#RIPCartoonNetwork పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోలో యానిమేషన్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు. "వావ్! ఇక్కడే కార్టూన్లు తయారవుతాయి! ఇకపై ఇక్కడ తయారు కావు. కార్టూన్ నెట్‌వర్క్ చనిపోయింది. పెద్ద యానిమేషన్ స్టూడియోలు బాగానే ఉన్నా, యానిమేషన్ కార్మికులందరూ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నిరంతరాయంగా వినోదాన్ని అందించే వ్యవస్థలో కార్టూన్ నెట్ వర్క్ ఒకటి. కానీ, స్టూడియోలు ప్రాజెక్ట్ లను రద్దు చేయడం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను, కళాకారులను పెద్ద సంఖ్యలో తొలగించడం వల్ల కార్టూన్ నెట్ వర్క్ చనిపోయే పరిస్థితి వచ్చింది. పెద్ద స్టూడియోలు ఖర్చును తగ్గించుకోవడం కోసం సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకుంటున్నాయి. అదే సమయంలో సీఈవోలు, ఎగ్జిక్యుటివ్ లు తమ జీతలను తగ్గించుకోవడం లేదు కదా? వారు మాత్రం ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకుంటూనే ఉన్నారు. అందుకే కార్టూన్ నెట్ వర్క్ చనిపోయే అవకాశం ఎదురవుతోంది. మీరు #RIPCartoonNetworkని షేర్ చేసి, మాకు సాయం చేయాలని కోరుతున్నాం” అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలోకి వదిలారు. ఈ వీడియోను చూసి చాలా మంది కార్టూన్ నెట్ వర్క్ ఛానెల్ మూతపడుతోందని భావించారు.
Read Also: బికినీ వేసుకుంటేనే అవకాశాలు వస్తాయన్నాడు - పాత రోజులను గుర్తు చేసుకున్న మనీషా కోయిరాలా
Also Read: త్రిష తొలి వెబ్ సిరీస్ బృంద స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది - ఎప్పుడు, ఎక్కడో చూడొచ్చు అంటే?