Shinzo Abe Funeral: జపాన్ మాజీ ప్రధాని, దివంగత షింజో అబే తుది వీడ్కోలు కార్యక్రమం టోక్యోలో మంగళవారం నిర్వహించారు. ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. షింజో అబేకు మోదీ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సరహా 20 మందికి పైగా దేశాధినేతలు పాల్గొన్నారు. 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ.. అబేతో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు.
ద్వైపాక్షిక చర్చలు
షింజో అబే వీడ్కోలు కార్యక్రమం తర్వాత ప్రధాని మోదీ.. జపాన్ ప్రధాన మంత్రి ఫ్యుమియో కిషిదతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. షింజో అబే కార్యక్రం కోసం జపాన్‌కు వచ్చిన నరేంద్ర మోదీకి కిషిద ధన్యవాదాలు తెలిపారు.
ఇలా జరిగింది
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే (67) 2022, జులై 8న దారుణ హత్యకు గురయ్యారు. షింజో అబేను దుండగుడు నాటు తుపాకీతో కాల్చి చంపాడు. దక్షిణ జపాన్‌లోని నారా నగరంలో రైల్వే స్టేషన్ వెలుపల ఎన్నికల ర్యాలీలో అబే ప్రసంగిస్తుండగా ఈ ఘోరం జరిగింది. వెనుక నుంచి వచ్చిన దుండగుడు నాటు తుపాకితో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.
షింజో అబే మెడలో ఒక తూటా, గుండెలో మరో తూటా వెంట వెంటనే దూసుకుపోయాయి. వెంటనే ఆయన ఛాతి పట్టుకొని కుప్పకూలిపోయారు. అప్పటికప్పుడు హెలికాప్టర్‌పై ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే షింజో తుది శ్వాస విడించారు. జపాన్ చరిత్రలో అత్యధిక కాలం (9 ఏళ్లు) ప్రధానిగా పని చేసిన వ్యక్తిగా షింజో అబే చరిత్ర సృష్టించారు.
Also Read: Russia-Ukraine War: 'పుతిన్ హెచ్చరికలు ఉత్తి మాటలు కావు- అణు యుద్ధం నిజమే కావొచ్చు'
Also Read: Rajasthan Congress Crisis: 'గహ్లోత్ ఇలా చేశారా? అసలు నమ్మలేకపోతున్నాను'- సోనియా గాంధీ అసంతృప్తి!