Ratan Tata: రతన్ టాటా 'సక్సెస్' మంత్రం ఇదే! ఆ మాటలు వినడంలో ఉన్న కిక్కే వేరప్పా!

ABP Desam   |  Murali Krishna   |  27 Sep 2022 11:55 AM (IST)

Ratan Tata: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు బాగా కిక్ ఇచ్చే విషయం ఏంటో తెలుసా?

(Image Source: PTI)

Ratan Tata: పారిశ్రామిక దిగ్గజంగా, టాటా గ్రూప్​ మాజీ ఛైర్మన్ రతన్ టాటా చాలా ఫేమస్. అయితే రతన్ టాటా ఓ పారిశ్రామికవేత్తగానే కాదు.. యువతలో స్ఫూర్తి నింపే మోటివేషనల్ స్పీకర్‌గా కూడా చాలా మందికి సుపరిచితం. ఆయన మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తోంది. అలాంటి రతన్ టాటాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

అదే ఆనందం!

84 ఏళ్ల వ్యాపార దిగ్గజం రతన్ టాటా తనను ఉత్తేజపరిచే విషయం గురించి ఆ వీడియోలో తెలిపారు. 

అందరూ "ఆ పని ఎప్పటికీ కాదు.. మీరు చెయ్యలేరు" అన్న పనిని సాధించడంలో ఓ కిక్ ఉంది. అదే నాకు ప్రేరణనిస్తుంది. అదే నన్ను ఉత్తేజపరుస్తుంది.                                                            - రతన్ టాటా, పారిశ్రామికవేత్త

ఈ వీడియోను RPG ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కింద నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

నిజమే.. రూ.1,00,000 లోపు ప్యాసింజర్ కారును తయారు చేయడం సాధ్యం కాదని రతన్ టాటాకు ఆటోమొబైల్ పరిశ్రమ చెప్పింది. కానీ ఆయన ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. రూ.లక్ష లోపు కారును తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.                                                   - నెటిజన్

సాధారణ మనిషి ఆలోచించే దానికంటే ఆయన ఎక్కువే ఆలోచిస్తారు. మనతో పాటు ఇంతటి గొప్ప వ్యక్తి ఉన్నారని గుర్తొచ్చిన ప్రతిసారీ చాలా ప్రేరణ కలుగుతుంది.                                                                  - నెటిజన్

టాటా సక్సెస్ మంత్రాలు

రతన్ టాటా పలు సందర్భాల్లో చెప్పిన టాప్-5 సక్సెస్ మంత్రాలు మీ కోసం

  1. జీవితంలో కష్టసుఖాలు రెండూ ఉండాలి. ఎందుకంటే అప్పుడే జీవితం విలువ అర్థమవుతుంది.
  2. మీరు వేగంగా నడవాలనుకుంటే, ఒంటరిగా నడవండి. కానీ మీరు చాలా దూరం నడవాలనుకుంటే, కలిసి నడవండి.
  3. ప్రజలు మీపై విసిరే రాళ్లను తీసుకోండి. ఓ స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి వాటిని ఉపయోగించండి.
  4. ఎవరూ ఇనుమును నాశనం చేయలేరు, కానీ దానికి తుప్పు పట్టవచ్చు. అలాగే, ఎవరూ ఒక వ్యక్తిని నాశనం చేయలేరు.. కానీ అతని ఆలోచనా విధానం చేయగలదు.
  5. నేను నా ప్రయాణంలో కొంతమందిని బాధపెట్టి ఉండవచ్చు, కానీ మంచి పని చేయడానికి రాజీపడకుండా కృషి చేసిన వ్యక్తిగా నన్ను అందరూ గుర్తించాలనుకుంటాను

Also Read: PFI Raids: 'ఆపరేషన్ PFI'- 8 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ, ఈడీ దాడులు ముమ్మరం

Also Read: Viral Video: పాప బ్యాగ్‌లో పాము- ఓపెన్ చేసిన టీచర్, వైరల్ వీడియో!

Published at: 27 Sep 2022 11:52 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.